Watch Video: 4 రన్స్ తేడాతో విజయం.. సంబురాల్లో ఆటగాళ్లు.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన అంపైర్.. నెట్టింట వైరల్

మ్యాచ్‌లో విజయానికి చివరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉంది. తొలి 5 బంతులు మాములుగానే నడిచినా.. చివరి బంతికి మాత్రం యాక్షన్‌, డ్రామా ఎక్కువ అవ్వడంతో..

Watch Video: 4 రన్స్ తేడాతో విజయం.. సంబురాల్లో ఆటగాళ్లు.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన అంపైర్.. నెట్టింట వైరల్
Last Over Cricket Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jul 17, 2022 | 2:20 PM

సౌత్ ఇండియాలో తీసే సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు మాములుగా ఉండవు. అదిరిపోయే ట్విస్టులతో ఈ యాక్షన్, డ్రామా సీన్స్ ప్లాన్ చేస్తుంటారు. ఫ్యాన్స్ అయితే వీటిపై ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇక క్రికెట్ విషయానికి వస్తే, అచ్చం సౌత్ ఇండియన్ సినిమాలో లాగే ఓ థ్రిల్లింగ్ కలిగించే సీన్ జరిగింది. అది కూడా చివరి ఓవర్‌లో కావడం విశేషం. హాంప్‌షైర్ వర్సెస్ లాంక్‌షైర్ జట్లు తలపడిన టీ20 బ్లాస్ట్ ఫైనల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌లో లాంక్‌షైర్ విజయానికి చివరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉంది. తొలి 5 బంతుల్లో జరిగిన డ్రామా చూసిన ప్రేక్షకులతోపాటు ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు. అయితే, చివరి బంతికి మాత్రం ఈ డ్రామా అద్భుతంగా క్లైమాక్స్‌కు చేరింది.

హాంప్‌షైర్ బౌలర్ నాథన్ ఎల్లిస్ వేసిన మొదటి 3 బంతుల్లో లాంక్‌షైర్ 4 పరుగులు మాత్రమే చేసింది. అంటే చివరి 3 బంతుల్లో గెలవడానికి 7 పరుగులు చేయాల్సి ఉంది. నాలుగో బంతికి వికెట్ పడింది. లాంక్‌షైర్ బ్యాట్స్‌మెన్ ల్యూక్ వుడ్ రనౌట్ అయ్యాడు. దీంతో లాంక్షైర్‌కు ఇంకా 7 బంతులు మిగిలి ఉండగా.. 5వ బంతికి 2 పరుగులు వచ్చాయి. అంటే చివరి బంతికి విజయానికి 5 పరుగులు కావాలి. ఈ సందర్భంలో ఒక సిక్స్ కొడితే, అంతా మారిపోయేది. కానీ, చివరి బంతిలో చూసిన యాక్షన్, డ్రామాను మీరు ఊహించలేరు.

ఇవి కూడా చదవండి

చివరి ఓవర్, చివరి బంతికి డ్రామా..!

లాంక్‌షైర్‌కు చివరి బంతికి 5 పరుగులు కావాలి. అంటే, సిక్స్ అవసరం. హాంప్‌షైర్ బౌలర్ నాథన్ ఎల్లిస్ బంతిని వేశాడు. బ్యాట్స్‌మన్ సింగిల్ తీయడంతో.. 4 పరుగులు తేడాతో గెలిచామని హాంప్‌షైర్‌ ఆటగాళ్లు సంబురాలు చేసుకోవడం ప్రారంభించాడు. మ్యాచ్‌ను ప్రసారం చేస్తున్న ఛానెల్ కూడా అతడిని 4 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించింది. అయితే ఈ సమయంలో నో బాల్‌ సూచిస్తున్న అంపైర్‌ వైపు ఎవరూ చూడలేదు.

ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని హాంప్‌షైర్ ఆటగాళ్ళు షాక్ అయ్యారు. లాంక్షైర్‌కు ఇది లాటరీ లాంటిది. ఇప్పుడు విజయానికి చివరి బంతికి 3 పరుగులు మాత్రమే మిగిలాయి. కానీ, బ్యాటర్స్ కేవలం పరుగు మాత్రమే చేయగలిగారు. దీంతో హాంప్‌షైర్ మ్యాచ్‌ను గెలుచుకుంది. అంటే 4 పరుగుల తేడా విజయం కాస్తా.. నో బాల్ వ్యవహారంతో కేవలం 1 పరుగు తేడాకు చేరింది. అదే సమయంలో అదృష్టవశాత్తూ లాంక్షైర్‌కు దక్కిన అవకాశాన్ని చేజార్చుకుంది.

హ్యాంప్‌షైర్ టీ20 బ్లాస్ట్‌లో విజయవంతమైన జట్టుగా..

ఈ హై యాక్షన్, డ్రామాతో కూడిన చివరి ఓవర్ తర్వాత, హాంప్‌షైర్ 1 పరుగుతో మ్యాచ్‌ను గెలుచుకుంది. దీనితో ఆ టీం మూడవసారి టీ20 బ్లాస్ట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. లీసెస్టర్‌షైర్‌తో పాటు ఇంగ్లండ్‌లో జరిగిన ఈ టీ20 టోర్నీ చరిత్రలో హాంప్‌షైర్ ప్రస్తుతం అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది.

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో