July 31: ITR ఫైలింగ్ నుంచి కిసాన్ యోజన కేవైసీ వరకు.. జులై 31లోపు పూర్తి చేయాల్సిన కీలక పనులు ఇవే..

జులై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఆలస్య రుసుము చెల్లించాలి. ఆదాయపు పన్ను చెల్లింపుదారు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షల వరకు లేదా అంతకంటే తక్కువ ఉంటే, ఆలస్య రుసుముగా రూ. 1,000 చెల్లించవలసి ఉంటుంది.

July 31: ITR ఫైలింగ్ నుంచి కిసాన్ యోజన కేవైసీ వరకు.. జులై 31లోపు పూర్తి చేయాల్సిన కీలక పనులు ఇవే..
Itr Filing
Follow us
Venkata Chari

|

Updated on: Jul 16, 2022 | 9:12 PM

ITR Filing: చాలా ముఖ్యమైన పనులు చేయడానికి ఈ నెల చివరి తేదీ అంటే జులై 31 చివరి తేదీగా ఉంది. ఈ నెలలో మీరు కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం నుంచి KYC పూర్తి చేయడం వంటి పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే, మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జులై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది పన్న స్లాబ్ మేరకు రూ.1000 నుంచి రూ.5000ల వరకు ఉంటుంది. అందుకే చివరి నిముషం వరకు ఎదురుచూడకుండా, ముందే ఈ పనులు పూర్తి చేసుకుంటే, ఎలాంటి టెన్షన్ ఉండదు. జులై 31లోగా మీరు సెటిల్ చేసుకోవలసిన 3 టాస్క్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ITR ఫైల్ చేయకపోతే పన్ను రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది..

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ సమీపంలో ఉంది. ఖాతా ఆడిట్ అవసరం లేని వ్యక్తిగత, వేతన ఉద్యోగుల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జులై 31, 2022గా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

జులై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఆలస్య రుసుము చెల్లించాలి. ఆదాయపు పన్ను చెల్లింపుదారు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షల వరకు లేదా అంతకంటే తక్కువ ఉంటే, ఆలస్య రుసుముగా రూ. 1,000 చెల్లించవలసి ఉంటుంది. పన్ను చెల్లింపుదారు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు అతను రూ. 5000 ఆలస్య రుసుము చెల్లించవలసి ఉంటుంది.

కిసాన్ సమ్మాన్ నిధి కోసం KYC

పీఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందుతున్న రైతులు జులై 31వ తేదీలోగా e-kycని పొందాలి. ఈ తేదీలోగా e-kyc ప్రక్రియను పూర్తి చేయని రైతులకు తదుపరి విడత డబ్బు అందదు. రైతులు ప్రధానమంత్రి కిసాన్ కోసం e-kycని రెండు విధాలుగా పూర్తి చేయవచ్చు. రైతులు తమ సమీప కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించడం ద్వారా వారి e-kycని పూర్తి చేయవచ్చు.

ఇది కాకుండా, ఇంట్లో కూర్చుని పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా e-kyc ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. దీని కోసం, మీ మొబైల్ నంబర్‌ను మీ ఆధార్ కార్డ్‌లో లింక్ చేయాల్సి ఉంటుంది. లింక్ చేసిన తర్వాత, మీరు ల్యాప్‌టాప్, మొబైల్ ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసి OTP ద్వారా ఇంట్లో కూర్చొని e-kyc పూర్తి చేయవచ్చు.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు నమోదు..

దేశంలోని చాలా చోట్ల వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) రైతులకు ఎంతో ఉపకరిస్తుంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులు తమ పంటలకు బీమా చేయడం ద్వారా ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చు. PMFBYలో నమోదు చేసుకోవడానికి చివరి తేదీ జులై 31గా ప్రభుత్వం నిర్ణయించింది.

రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద నమోదు చేసుకోవడానికి, మీరు మీ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్, కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పబ్లిక్ సర్వీస్ సెంటర్, అధీకృత బీమా కంపెనీని సంప్రదించవచ్చు లేదా http://pmfby.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం, రైతులు ఖతౌనీ, ఐడీ కార్డ్ (ఆధార్, పాన్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్), బ్యాంక్ పాస్‌బుక్ అవసరం అవుతాయి.