AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి సినిమా రా అయ్యా.!! ఏకంగా 38 విడాకుల్ని ఆపింది.. ఆ మూవీ ఏదంటే..

ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకుల ముందు వస్తున్నాయి. లవ్ స్టోరీలు, క్రైం థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్స్ కూడా మంచి విజయాలను అందుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అలాంటివాటిలో ఈ సినిమా ఒకటి.

ఇదెక్కడి సినిమా రా అయ్యా.!! ఏకంగా 38 విడాకుల్ని ఆపింది.. ఆ మూవీ ఏదంటే..
Movie News
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2026 | 12:04 PM

Share

సినిమాల ప్రభావం జనలపై ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశం జనాలు ఎక్కువగా అభిమానించే వాటిలో క్రికెట్ ఒకటి, సినిమా మరొకటి. ఈ రెండు అంటే మన జనాలకు పిచ్చి.. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఆడియన్స్ పై ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే ప్రేమ కథ సినిమాలు చూసి ప్రేమలో పడ్డ వారు ఉన్నారు. ఎమోషనల్ సినిమాలు చూసి కన్నీళ్లు పెట్టుకునే ఆడియన్స్ ఉన్నారు. జనాలు సినిమాలను ఎంత ఓన్ చేసుకుంటారంటే.. మొన్నామధ్య విడుదలైన బలగం సినిమా చూసి విడిపోయిన అన్న చెల్లెల్లు ఎంతో మంది కలిశారు. ఎన్నో విడిపోయిన కుటుంబాలు కలిశాయి అలాగే ఇప్పుడు ఓ సినిమా చూసి విడిపోయిన భార్య భర్తలు కలిశారు.

ఈ సినిమా చూసి ఏకంగా విడాకులు తీసుకోవాల్సిన 38 జంటలు తిరిగి కలిశాయట.. ఒక సినిమా ఏకంగా 38 విడాకుల కేసులను ఆపిందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ సినిమా మరేదో కాదు ఇరుగ పట్రు. ఇరుగపట్రు అనే తమిళ చిత్రం విడుదలైన రెండో వారంలోనే త్రిచి ప్రాంతంలో 38 వివాహ రద్దు కేసులను వెనక్కి తీసుకోవడానికి తోడ్పడిందని ఆ సినిమా హీరో విక్రమ్ ప్రభు వెల్లడించారు. అలా విడిపోవాలనుకున్న జంటలను ఈ సినిమా విడిపోకుండా చేసిందని హీరో తెలిపాడు. ఈ చిత్రంతో కనీసం వెయ్యి పెళ్ళిళ్ళనైనా కాపాడాలని తాము భావించామని ఆయన పేర్కొన్నారు.

ఎలాంటి ప్రమోషన్స్ , హాడావిడీ లేకుండా సినిమా ఇంత పెద్ద ప్రభావం చూపడం తమకు ఎంతో గర్వకారణంగా అనిపించిందని చిత్ర బృందం తెలియజేసింది. పెళ్ళి విలువను ఈ సినిమా గుర్తు చేస్తుందని, వైవాహిక బంధం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుందని విక్రమ్ ప్రభు అన్నారు. 2023లో విడుదలైన ఈ సినిమాలో మూడు పెళ్ళైన జంటలు, వారు ఎదుర్కొనే సమస్యలు, చివరకు మళ్ళీ ఎలా కలుసుకుంటారనేది చూపించారు. ఈ సినిమా కథాంశం వివాహ బంధాలను కాపాడటంలో ఎంతగానో సహాయపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
30 అడుగుల బావిలో పడిన మహిళ.. ఎలా బయటకు వచ్చిందంటే..
30 అడుగుల బావిలో పడిన మహిళ.. ఎలా బయటకు వచ్చిందంటే..
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా అవ్వాలంటే గుప్పెడు తింటే చాలు
సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా అవ్వాలంటే గుప్పెడు తింటే చాలు
అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం..
అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం..
అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు
మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ
మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌లోనే..
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌లోనే..
లాస్ట్ మ్యాచ్ లేకుండానే రోహిత్ రిటైర్మెంట్.. షాకిచ్చిన గంభీర్
లాస్ట్ మ్యాచ్ లేకుండానే రోహిత్ రిటైర్మెంట్.. షాకిచ్చిన గంభీర్
కూరగాయల నుండి కిరాణం వరకు..భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు
కూరగాయల నుండి కిరాణం వరకు..భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు