AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: టీమిండియా ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వొద్దంతే..!

Team India T20 World Cup Wins List: మూడు వేర్వేరు దశాబ్దాల్లో, ముగ్గురు వేర్వేరు కెప్టెన్ల హయాంలో భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం మన క్రికెట్ ప్రతిభకు నిదర్శనం. ఈ గెలుపు జోరు ఇలాగే కొనసాగాలని దేశం అంతా కోరుకుంటుంది.

Video: టీమిండియా ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వొద్దంతే..!
Ind Vs Nz Team India World Cup Wins
Venkata Chari
|

Updated on: Mar 09, 2026 | 10:28 AM

Share

Team India T20 World Cup Wins List: భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అరుదైన ఘనత నమోదైంది. 2007లో మొదలైన టీ20 ప్రపంచకప్ ప్రస్థానం, 2024లో కొనసాగి, ఇప్పుడు 2026లో ముచ్చటగా మూడో టైటిల్‌తో భారత్‌ను ‘క్రికెట్ కింగ్’గా నిలబెట్టింది. స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ చారిత్రాత్మక వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి క్రికెట్ అభిమానిని ఉద్వేగానికి గురిచేస్తోంది.

2007: యువ భారత్ సంచలనం..

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఒక యువ జట్టు సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టినప్పుడు ఎవరూ ఊహించలేదు. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి, తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన క్షణం భారత క్రికెట్ దశను మార్చేసింది. శ్రీశాంత్ పట్టిన ఆ క్యాచ్, జోగిందర్ శర్మ బౌలింగ్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచే ఉన్నాయి.

2024: రోహిత్ శర్మ సేన విశ్వవిజేత..

దాదాపు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత, రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్, సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్, బుమ్రా స్పెల్ భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించాయి.

2026: వరుసగా రెండోసారి.. చరిత్రలో మూడోసారి!

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో, గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. వెస్టిండీస్ (2), ఇంగ్లాండ్ (2) రికార్డులను అధిగమించి, మూడు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ముఖ్యంగా సంజూ శాంసన్ బ్యాటింగ్ విధ్వంసం, బుమ్రా నిప్పులు చెరిగే బౌలింగ్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి.

స్టార్ స్పోర్ట్స్ వైరల్ వీడియో:

స్టార్ స్పోర్ట్స్ పంచుకున్న వీడియోలో ఈ మూడు విజయాల తాలూకు భావోద్వేగాలను ఒకే చోట చేర్చారు. 2007లో ధోనీ చిరునవ్వు, 2024లో రోహిత్ కన్నీళ్లు, 2026లో సూర్యకుమార్ గంభీర్ సంబరాలు.. ఇవన్నీ చూస్తుంటే భారత క్రికెట్ ఎంత ఎత్తుకు ఎదిగిందో అర్థమవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us