Asia Cup: ఆసియా కప్ వేదికలో మార్పు.. తేల్చేసిన లంక బోర్డ్ సెక్రటరీ.. ఎక్కడంటే?
16 రోజుల సుదీర్ఘ టోర్నమెంట్ ఆసియా కప్ నిర్వహణపై శ్రీలంక చేతులెత్తేసేలా కనిపిస్తోంది. దీంతో వేరే దేశానికి ఈ టోర్నమెంట్ తరలనున్నట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.
Asia Cup: శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్ టోర్నమెంట్‌కు అక్కడి రాజకీయ అస్థిరత ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ప్రయత్నించింది. కానీ, తాజా పరిణామాలు మాత్రం అందుకు విరుద్ధంగా మారాయి. PTI తో శ్రీలంక కార్యదర్శి మోహన్ డి సిల్వా మాట్లాడుతూ, ఈ 16 రోజుల సుదీర్ఘ టోర్నమెంట్‌ను యూఏఈలో నిర్వహించే ఛాన్స్ ఉంది. అంటే శ్రీలంక గడ్డపై జరగాల్సిన క్రికెట్, యూఏఈకి మారేలా ఉందంటూ చెప్పుకొచ్చాడని తెలుస్తోంది. లంకలో అల్లర్లతో ఈ టోర్నమెంట్ జరిగేలా కనిపించడం లేదు. అయితే దీనికి అధికారికంగా అనుమతి రావాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..