Watch Video: క్యాచ్ మిస్ చేసి కోపం తెప్పించాడు.. ఆపై డ్యాన్స్ చేసి ఖుషీ చేసిన బౌలర్.. నెట్టింట వైరల్ వీడియో..

గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు పాక్ బౌలర్ హసన్ అలీ తన బౌలింగ్‌తో బలమైన ప్రదర్శన ఇచ్చినా ఫీల్డింగ్‌లో మాత్రం ఎప్పటిలాగే నిరాశపరిచాడు.

Watch Video: క్యాచ్ మిస్ చేసి కోపం తెప్పించాడు.. ఆపై డ్యాన్స్ చేసి ఖుషీ చేసిన బౌలర్.. నెట్టింట వైరల్ వీడియో..
Sl Vs Pak Pakistan Fast Bowler Hasan Ali
Follow us
Venkata Chari

|

Updated on: Jul 17, 2022 | 10:19 AM

క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి. వీటిని అభిమానులు కూడా ఎంతో ఇష్టపడుతుంటారు. అలాగే కొన్ని సంఘటనలు ఒక్కోసారి నవ్వుతెప్పిస్తుంటాయి. తాజాగా జులై 16 శనివారం నుంచి శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో పాక్ ఫాస్ట్ బౌలర్లు రెచ్చిపోయారు. షాహీన్ షా అఫ్రిది ఎక్కువ వికెట్లతో ప్రశంసలు అందుకున్నాడు. కానీ, పేసర్ హసన్ అలీ చేసిన ఓ పని, నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే, హసన్ అలీ అతని బౌలింగ్‌తో పాటు, అతని ఫీల్డింగ్, అతని డ్యాన్స్‌తో కూడా చాలా చర్చనీయాంశమైంది. హసన్ అలీ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ఒక్కోసారి ఆనందాన్ని అందిస్తే, కొన్నిసార్లు కోపాన్ని తెప్పిస్తాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో క్యాచ్‌ జారవిడిచినప్పుడు తప్పును ఎవరూ మరిచిపోలేదు. ప్రపంచకప్‌‌ ముగిసి 9 నెలలు గడిచాయి. కానీ, హసన్ ఇప్పుడు శ్రీలంకపై అదే తప్పును పునరావృతం చేశాడు.

గాలె టెస్టు తొలి రోజున హసన్ అలీ సింపుల్ క్యాచ్‌ను వదిలేశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 65వ ఓవర్‌లో, కసున్ రజిత నసీమ్ షా వేసిన బంతిని డీప్ స్క్వేర్ లెగ్ వైపు గాలిలో ఎత్తాడు. హసన్ అలీ ఓ సులభమైన క్యాచ్‌ను పట్టుకోలేకపోయాడు. అయితే స్వల్ప వ్యవధిలో చివరి వికెట్ పడడంతో పాకిస్థాన్ పెద్దగా నష్టపోలేదు.

ఇవి కూడా చదవండి

డ్యాన్స్ చేసిన హసన్ అలీ..

హసన్ అలీ క్యాచ్‌ను జారవిడిచిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పాక్ అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే, కొద్దిసేపటికే, హసన్ అలీకి సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈసారి హసన్ అలీ కారణంగా అందరి ముఖంలో చిరునవ్వు వచ్చింది. వాస్తవానికి, హసన్ అలీ మ్యాచ్ సమయంలో జట్టు అదనపు ఆటగాడితో మాట్లాడుతూ.. హఠాత్తుగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. అతని డ్యాన్స్ చూసి వ్యాఖ్యాతలు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.

బౌలింగ్‌లో బలమైన ప్రదర్శన..

వీరిద్దరూ కాకుండా, బౌలర్‌గా హసన్ అలీ మొదటి రోజు మ్యాచ్‌లో చాలా బాగా ఆడాడు. అతను 12 ఓవర్లలో కేవలం 23 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తరపున అత్యధికంగా 76 పరుగులు చేసి శ్రీలంకను 222 పరుగులకే కట్టడి చేసిన దినేష్ చండిమాల్ ఇందులో అతిపెద్ద వికెట్ కావడం విశేషం.