AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parivartan Yoga: పరివర్తన యోగం.. ఇక ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

జ్యోతిషశాస్త్రంలో పరివర్తన యోగానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా శుభగ్రహాల మధ్య జరిగే పరివర్తన యోగం శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. జూన్ 9, 10, 11 తేదీల్లో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు, మీన రాశిలోని చంద్రుడి మధ్య ఏర్పడే పరివర్తన యోగం ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పబడుతోంది. చంద్రుడి రాశి అయిన కర్కాటకంలో గురువు సంచారం చేయడం, అలాగే గురువుకు చెందిన మీన రాశిలో చంద్రుడు ప్రవేశించడం వల్ల ఈ యోగం మరింత శక్తివంతంగా మారింది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి మంచి అవకాశాలు, అభివృద్ధి, అదృష్టం లభించే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 04, 2026 | 4:04 PM

Share
జ్యోతిషశాస్త్రంలో పరివర్తన యోగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అందులోనూ శుభగ్రహాల మధ్య పరివర్తనకు విశేషమైన ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరిగింది. పరివర్తన యోగం వల్ల తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ నెల(జూన్) 9, 10, 11 తేదీల్లో ఉచ్ఛ గురువుకు, మీన చంద్రుడికి మధ్య జరిగే పరివర్తన మరింతగా ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు ఉండడం, గురువుకు చెందిన మీన రాశిలో చంద్రుడు సంచారం చేయడం వల్ల ఈ విశేషమైన పరివర్తన యోగం కలిగింది. మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులవారికి దీనివల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది.

1 / 7
మిథునం: ఈ రాశికి ఈ గురు, చంద్రుల పరివర్తన విశేష ఫలితాలనిస్తుంది. ధన, దశమ స్థానాల్లో ఉన్న గురు చంద్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశంఉంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. ఆర్థిక, ఆస్తి సంబంధమైన విషయాలు పూర్తి అనుకూలంగా మారతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

2 / 7
కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడం, భాగ్య స్థానంలో ఉన్న రాశ్యధిపతి చంద్రుడితో పరివర్తన చెందడం వల్ల జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. శత్రు, రోగ, రుణ సమస్యలు చాలావరకు మటుమాయం అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉన్నతస్థాయి వారితో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.

3 / 7
కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న చంద్రుడితో లాభ స్థానంలో ఉన్న గురువుకు పరివర్తన ఏర్పడడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. కెరీర్ పరంగా అనేక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ లాభం కలుగుతుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఆశించిన సత్ఫలితాలనిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది.

4 / 7
వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న గురువుతో పంచమ స్థానంలో ఉన్న చంద్రుడికి పరివర్తన కలగడం వల్ల కలలో కూడా ఊహించని రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరగడంతో పాటు, పదోన్నతి కూడా కలుగుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

5 / 7
మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న చంద్రుడితో సప్తమంలో ఉచ్ఛలో ఉన్న గురువుకి పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. దీని వల్ల ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆదాయపరంగా దూసుకుపోయే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి  విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి.

6 / 7
మీనం: రాశ్యధిపతి గురువుకు, పంచమాధిపతి చంద్రుడికి మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు, ధనయోగాలు పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా మారతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

7 / 7
Follow Us