AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: కోహ్లీ ప్లేస్‌లో వన్డే టీమ్‌లోకి వచ్చే ప్లేయర్ ఎవరు? ఆ నలుగురిలో ఒకరికి ఛాన్స్..!

ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిపై ఆసక్తి నెలకొంది. తిలక్ వర్మ, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లలో ఒకరికి అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

IND vs AFG: కోహ్లీ ప్లేస్‌లో వన్డే టీమ్‌లోకి వచ్చే ప్లేయర్ ఎవరు? ఆ నలుగురిలో ఒకరికి ఛాన్స్..!
Virat Kohli Replacement
SN Pasha
|

Updated on: Jun 04, 2026 | 3:22 PM

Share

ఐపీఎల్ హంగామా తర్వాత టీమిండియా మళ్లీ సంప్రదాయ క్రికెట్‌లోకి అడుగుపెడుతోంది. ఈ నెల 6 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో ఒక టెస్ట్ మ్యాచ్, 13 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బరిలోకి దిగుతారనుకుంటే.. సిరీస్ ఆరంభానికి రెండు వారాల ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొడ కండరాల నొప్పితో ఈ సిరీస్‌కు దూరం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఒక వేళ అదే జరిగితే విరాట్ కోహ్లీ ప్లేస్‌లో ఏ ప్లేయర్‌ను తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. దీనిపై సెలెక్టర్లు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే ఎక్కువ శాతం ఓ నలుగురు ఆటగాళ్లకు మాత్రం ఈ పోటీలో ఉన్నారు. ఆ నలుగురు కూడా టాలెంట్‌లో తక్కువేం కాదు, ఒకరికి ఒకరు తీసిపోరు కూడా.. కాకపోతే సెలెక్టర్ల నజర్ ఎవరిపైన ఉంటే వారు.. కోహ్లీ స్థానంలో టీమిండియాలో స్థానం సంపాదించుకొని.. ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు వన్డేలు ఆడనున్నారు. ఇంతకీ ఎవరా నలుగురు అనేది చూద్దాం..

తిలక్ వర్మ, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్.. ఈ నలుగురిలో కచ్చితంగా ఒకరు టీమిండియాలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ వన్డేల్లో వన్ డౌన్‌‌లో బ్యాటింగ్‌కు వస్తాడు కాబట్టి.. ఆ ప్లేస్‌‌లో ఆడే ప్లేయర్‌నే తీసుకుంటారు. వీరిలో కొందరు ఓపెనర్‌గా ఆడుతున్నా.. వన్ డౌన్‌లో సైతం బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నొళ్లే. ముఖ్యంగా తిలక్ వర్మ, పడిక్కల్.. ఈ ఇద్దరిపైనే సెలెక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చూడాలి మరి సెలెక్టర్లు ఎవరిపై దయ చూపుతారో.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us