AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సింపుల్‌గా సమంత సీమంతం వేడుక!

Samantha: సింపుల్‌గా సమంత సీమంతం వేడుక!

Phani CH
|

Updated on: Jul 18, 2026 | 6:32 PM

Share

'మా ఇంటి బంగారం' విజయానంతరం తన గర్భధారణను అధికారికంగా ప్రకటించిన సమంత ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల కుటుంబ సభ్యుల మధ్య సాదాసీదాగా జరిగిన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబరులో తొలి బిడ్డకు జన్మనివ్వనున్న సమంత, అనంతరం కొంత విరామం తీసుకుని కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

గతేడాది డిసెంబరులో దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న సమంత.. గత నెలలో ‘మా ఇంటి బంగారం’ సినిమాతో వచ్చింది. రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించి.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇకపోతే ఇప్పడీ మూవీ హాట్‌స్టార్ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అదే టైంలో సమంత సీమంతం కూడా జరిగినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ తర్వాత బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. తర్వాత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఖరారు చేసింది. రీసెంట్‌గానే భర్తతో కలిసి థాయ్‌లాండ్ ట్రిప్ వేసింది. ఆ తర్వాత చిత్తూరులోని ఓ శుభకార్యం కోసం అత్తగారింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఈమెకు సింపుల్‌గా సీమంతం చేశారు. ఆ ఫొటోలని రాజ్ సోదరి శీతల్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేయగా అవి కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సమంత ఈ ఏడాది డిసెంబరులో బిడ్డకు జన్మనిచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆరేడు నెలలు విశ్రాంతి తీసుకుని కొత్త సినిమాలు మొదలుపెట్టే అవకాశముంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The Odyssey craze: షాకింగ్.. సినిమా చూడడం కోసం ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకున్న లేడీ

Fauzi: ‘ఫౌజీ’తో ప్రభాస్ వార్ మొదలు.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్‌తో పాన్ ఇండియా హంగామా..!

Ramayana: ‘రామాయణ’ ట్రైలర్‌కు గ్లోబల్ గ్రాండ్ ఎంట్రీ… కామిక్-కాన్ వేదికగా చరిత్ర సృష్టించనున్న మేకర్స్

‘వారణాసి’ తర్వాత జక్కన్న ప్లాన్ ఏంటి?… నెక్ట్స్ హీరోపై మొదలైన భారీ చర్చ..!

Jana Nayagan: ఆర్నెల్ల నిరీక్షణకు ముగింపు… ‘జన నాయగన్’ రాకతో బాక్సాఫీస్‌లో కొత్త సమరం..!

Follow Us