AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Odyssey craze: షాకింగ్.. సినిమా చూడడం కోసం ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకున్న లేడీ

The Odyssey craze: షాకింగ్.. సినిమా చూడడం కోసం ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకున్న లేడీ

Phani CH
|

Updated on: Jul 18, 2026 | 6:30 PM

Share

క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో అసాధారణ క్రేజ్‌ను సృష్టిస్తోంది. ఐమ్యాక్స్ 70ఎంఎమ్‌లో తొలి రోజు సినిమా చూడాలనే ఉద్దేశంతో ఓ మహిళ తన గర్భధారణ ప్రణాళికనే వాయిదా వేసుకోవడం చర్చనీయాంశమైంది. పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో రూపొందిన ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు విమాన ప్రయాణాలు చేస్తూ, గంటల తరబడి వర్చువల్ క్యూల్లో వేచి చూస్తున్నారు.

గత కొన్ని రోజులుగా వరల్డ్ వైడ్‌ ఉన్న ఫిల్మ్ లవర్స్ అందరూ ఒకే ఒక్క సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు. ఆ సినిమానే ‘ది ఒడిస్సీ’. హాలీవుడ్ తోప్ డైరెక్టర్ గా నామ్ కమాయించిన డైరెక్టర్.. క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాకు డైరెక్టర్. ఎన్నో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే దాదాపు రూ.2000 కోట్లతో నిర్మించిన ఈ సినిమా కోసం ఓ లేడీ ఏకంగా ప్రెగ్నెన్సీని పోస్ట్ చేసుకోడం ఇప్పుడు త్రూ అవుట్ వరల్డ్ హాట్ టాపిక్ అవుతోంది. ది ఒడిస్సీ మూవీని గ్రీకు పురాణాల్లోని ఒడిసియస్ అనే రాజు జీవితం ఆధారంగా ఈ మూవీని తీశారు. అందరూ మూవీని చూడాలని తెగ ఎగ్జైట్ అవుతుంటే ఓ మహిళ అభిమాని మాత్రం విచిత్రమైన నిర్ణయం తీసుకుంది.గతేడాది ఓ సందర్భలో అమెరికా కాలిఫోర్నియాకు చెందిన 29 ఏళ్ల అంబర్ కానగన్‌కి రెండో బిడ్డ గురించి ఆలోచించమని తన స్నేహితురాలు చెప్పింది. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఐమ్యాక్స్ 70ఎమ్ఎమ్‌లో తొలిరోజు ‘ది ఒడిస్సీ’ చూడటం కుదరదని, అందుకే బిడ్డని కనే ప్లాన్ వాయిదా వేసుకుంటానని చెప్పింది. మూవీ రిలీజ్ సందర్భంగా సదరు మహిళాభిమాని, హాలీవుడ్ ప్రముఖ వెబ్‌సైట్ తో.. ఇదంతా చెప్పడంతో ఈ సంగతి బయటపడింది. అంబర్ మాత్రమే కాదు ఈ సినిమా కోసం మరెందరో అభిమానులు చిత్రవిచిత్రమైన పనులన్నీ చేస్తున్నారు. ఎలాగైనా ఐమ్యాక్స్ థియేటర్లలోనే ఈ మూవీ చూడాలని.. అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు విమాన ప్రయాణాలు చేసి, గంటల తరబడి వర్చువల్ క్యూల్లో ఉండి మరీ ‘ది ఒడిస్సీ’ చూస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే.. ఈ మూవీని పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో తీశారు. ప్రపంచవ్యాప్తంగా 40 మాత్రమే ఐమ్యాక్స్ థియేటర్లలు ఉండటంతో ఆయా థియేటర్లలో టికెట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Fauzi: ‘ఫౌజీ’తో ప్రభాస్ వార్ మొదలు.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్‌తో పాన్ ఇండియా హంగామా..!

Ramayana: ‘రామాయణ’ ట్రైలర్‌కు గ్లోబల్ గ్రాండ్ ఎంట్రీ… కామిక్-కాన్ వేదికగా చరిత్ర సృష్టించనున్న మేకర్స్

‘వారణాసి’ తర్వాత జక్కన్న ప్లాన్ ఏంటి?… నెక్ట్స్ హీరోపై మొదలైన భారీ చర్చ..!

Jana Nayagan: ఆర్నెల్ల నిరీక్షణకు ముగింపు… ‘జన నాయగన్’ రాకతో బాక్సాఫీస్‌లో కొత్త సమరం..!

Naga Chaitanya: ‘వృషకర్మ’తో చైతూ కొత్త రికార్డు.. విడుదలకే ముందే బిజినెస్ బ్లాస్ట్..!

Follow Us