AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fauzi: 'ఫౌజీ'తో ప్రభాస్ వార్ మొదలు.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్‌తో పాన్ ఇండియా హంగామా..!

Fauzi: ‘ఫౌజీ’తో ప్రభాస్ వార్ మొదలు.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్‌తో పాన్ ఇండియా హంగామా..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 18, 2026 | 6:28 PM

Share

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఫౌజీ' నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. యుద్ధభూమి నేపథ్యంలో ప్రభాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2026 డిసెంబర్ 3న విడుదల కానున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా, ఎమోషన్, దేశభక్తి, యాక్షన్ మేళవింపుతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా నుంచి బిగ్‌ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అఫీషియల్‌గా లాంచ్ చేసిన మేకర్స్, కొత్త డిస్కషన్‌కు తెరతీశారు. యుద్ధభూమి నేపథ్యంలో వచ్చిన ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. వర్షంలో తడిసిపోయి, ఒళ్లంతా రక్తపు మరకలతో, గాయాలతో యుద్ధభూమి మధ్యలో గన్ పట్టుకుని రాయి మీద కూర్చున్న ప్రభాస్ లుక్ నేషనల్ లెవల్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. చుట్టూ మృతదేహాలు, శిథిలాలు కనిపిస్తున్న ఈ పోస్టర్ తో సినిమా టోన్‌, స్కేల్‌ ఎలా ఉండబోతుందో కూడా హింట్ ఇచ్చారు మేకర్స్‌. ‘ఒంటరిగా పోరాడే ఓ బెటాలియన్‌’ అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాను 2026 డిసెంబర్‌ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘సీతారామం’ లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హను రాఘవపూడి నుంచి వస్తున్న సినిమా కావటంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. బ్రిటిష్ ఇండియా కాలం నాటి పీరియాడిక్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేమ కథకు దేశభక్తి, భారీ యాక్షన్ అంశాలను యాడ్ చేస్తూ తనదైన స్టైల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌ ఇమాన్వీ హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మిథున్‌ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌ టైమ్స్‌లో ప్రభాస్ చేసిన సినిమాల్లో గ్రాండియర్‌, ఫాంటసీ, యాక్షన్ ఎలిమెంట్స్‌ భారీగా ఉన్నా… ఆడియన్స్‌కు ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయ్యింది. ఆ గ్యాప్‌ను ఫౌజీ ఫిల్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే అదే ట్రెండ్ కనిపిస్తోంది. పీరియాడిక్ ఎమోషనల్ వార్‌ డ్రామా కావటంతో దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో 90 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. నాన్‌స్టాప్‌గా ఆ వర్క్‌ను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యింది మూవీ టీమ్. షూటింగ్ పూర్తిగా కాకుండా ఇంత సడన్‌గా రిలీజ్ డేట్‌ ప్రకటించటం వెనుక ఓటీటీ సంస్థల ప్రెజర్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు 180 కోట్ల ఫౌజీ డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ఓటీటీ సంస్థ ఎట్టి పరిస్థితుల్లో సినిమాను డిసెంబర్ కల్లా రిలీజ్ చేయాలన్న కండిషన్ పెట్టడంతో, ఆ టార్గెట్ ను రీచ్‌ అయ్యేలా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా డార్లింగ్ కాంపౌండ్ నుంచి సాలిడ్ అప్‌డేట్ రావటంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ramayana: ‘రామాయణ’ ట్రైలర్‌కు గ్లోబల్ గ్రాండ్ ఎంట్రీ… కామిక్-కాన్ వేదికగా చరిత్ర సృష్టించనున్న మేకర్స్

‘వారణాసి’ తర్వాత జక్కన్న ప్లాన్ ఏంటి?… నెక్ట్స్ హీరోపై మొదలైన భారీ చర్చ..!

Jana Nayagan: ఆర్నెల్ల నిరీక్షణకు ముగింపు… ‘జన నాయగన్’ రాకతో బాక్సాఫీస్‌లో కొత్త సమరం..!

Naga Chaitanya: ‘వృషకర్మ’తో చైతూ కొత్త రికార్డు.. విడుదలకే ముందే బిజినెస్ బ్లాస్ట్..!

Paradise: ‘ది ప్యారడైజ్’పై రూ.110 కోట్ల రూమర్స్… మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఇదే..!

Follow Us