AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paradise: 'ది ప్యారడైజ్'పై రూ.110 కోట్ల రూమర్స్... మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఇదే..!

Paradise: ‘ది ప్యారడైజ్’పై రూ.110 కోట్ల రూమర్స్… మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఇదే..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 18, 2026 | 5:44 PM

Share

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజు రూ.110 కోట్లకు కొనుగోలు చేశారన్న ప్రచారాన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరి ఖండించారు. ఇప్పటివరకు ఎలాంటి బిజినెస్ డీల్ జరగలేదని స్పష్టం చేశారు. అధికారిక ప్రకటనలనే నమ్మాలని కోరిన మేకర్స్, షూటింగ్ వేగంగా కొనసాగుతోందని, సెప్టెంబర్ విడుదల లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు.

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా ఆలస్యమవుతున్నా, ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మాత్రం ఆగట్లేదు. ఈ సినిమా హక్కులను నిజంగానే దిల్ రాజు 110 కోట్లకు సొంతం చేసుకున్నారా..? ప్యారడైజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనేశారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత..? వీటిపై నిర్మాతలేమంటున్నారు..? షూటింగ్ అప్‌డేట్స్ ఏంటి..? దసరా తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు 110 కోట్లకు ది ప్యారడైజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్‌పై స్పందించిన చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి.. పంపిణీ హక్కులను ఇప్పటివరకు ఎవరికీ అమ్మలేదని తేల్చి చెప్పారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ వార్తలన్నీ పూర్తిగా ఫేక్ అని మేకర్స్ కొట్టిపారేసారు. ప్యారడైజ్ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ అయినా, బిజినెస్ వివరాలైనా తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే వెల్లడిస్తామని.. అంతవరకు వదంతులను నమ్మవద్దని సుధాకర్ చెరుకూరి కోరారు. దీంతో ఇన్నాళ్లుగా నాన్-థియేట్రికల్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌పై జరుగుతున్న ప్రచారానికి ఒక్కసారిగా చెక్ పడినట్లయింది. ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఎలాంటి బ్రేకులు లేకుండా వేగంగా జరుగుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. మొత్తానికి సినిమా ఆలస్యమవుతుందేమో కానీ.. దీనిపై ఉన్న క్రేజ్, అంచనాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Akhil Akkineni: ‘లెనిన్’తో మారిన అఖిల్… ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!

ఒక్క సినిమాలో ఐదుగురు హీరోయిన్లు… గ్లోబల్ మూవీస్ కొత్త ఫార్ములా..!

చిన్న సినిమాల నుంచి వందల కోట్ల సీక్వెల్స్… బ్లాక్‌బస్టర్ల కొత్త లెక్కలు..!

Yash: యష్ డబుల్ స్పీడ్.. వరుస పాన్ ఇండియా సినిమాలతో భారీ ప్లాన్..!

టాలీవుడ్‌లో గేరు మార్చిన హీరోయిన్లు… బిగ్ హిట్ కోసం భారీ ప్లాన్..!

Published on: Jul 18, 2026 05:13 PM
Follow Us