AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: 'లెనిన్'తో మారిన అఖిల్... ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!

Akhil Akkineni: ‘లెనిన్’తో మారిన అఖిల్… ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 18, 2026 | 5:10 PM

Share

దశాబ్దకాలంగా ఎదురుచూసిన విజయాన్ని 'లెనిన్'తో అందుకున్న అఖిల్ అక్కినేని ఇప్పుడు కెరీర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. 'ఏజెంట్' తర్వాత కనిపించిన ఒత్తిడికి భిన్నంగా ఈసారి ఎంతో పరిణితితో వ్యవహరిస్తున్నారు. ఇకపై కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటానని చెప్పిన అఖిల్, తదుపరి సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

పదేళ్లుగా ఎదురుచూస్తున్న సక్సెస్ ‘లెనిన్’ సినిమాతో రావడంతో.. అఖిల్ కెరీర్ ఇకపై సరికొత్త టర్న్ తీసుకోబోతుందా..? ‘ఏజెంట్’ టైమ్‌లో అగ్రెసివ్‌గా కనిపించిన అయ్యగారు.. ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత ఎందుకింత సైలెంట్ అయిపోయారు..? కథల ఎంపికలో అక్కినేని వారసుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు..? నెక్ట్స్ నటనకు ఆస్కారమున్న పాత్ర చేస్తారా లేక కమర్షియల్ బాట పడతారా? అఖిల్ కెరీర్ ఇన్నాళ్లూ ఒక లెక్క.. ‘లెనిన్’ సినిమా తర్వాత ఇంకో లెక్క అన్నట్లుగా మారిపోయింది. దాదాపు పదేళ్లుగా ఆయన ఎంతగానో వేచి చూస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సక్సెస్ ఎట్టకేలకు ఈ సినిమాతోనే దక్కింది. దీంతో ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడటంతో పాటు అఖిల్ కెరీర్ ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో 2.0 వర్షన్ మొదలవుతుంది. సక్సెస్ వచ్చినా కూడా అఖిల్ దాన్ని ఏమాత్రం తలకెక్కించుకోకుండా చాలా హుందాగా ఉండటం అందరినీ ఆకర్షిస్తోంది. ‘ఏజెంట్’ టైమ్‌లో ఎంతో అగ్రెసివ్‌గా కనిపించిన అయ్యగారు.. ఇప్పుడు చాలా మెచ్యూరిటీతో బిహేవ్ చేస్తున్నారు. పైగా ఇకపై సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటానని అభిమానులకు ప్రామిస్ చేసి తనలో వచ్చిన మార్పును చూపించారు. లెనిన్ సక్సెస్‌తో అఖిల్‌లో కొత్త జోష్ కనిపిస్తుంది. నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయబోతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారిందిప్పుడు. మళ్లీ ‘లెనిన్’ తరహాలోనే పూర్తి నటనకు ఆస్కారమున్న విభిన్నమైన పాత్ర ఎంచుకుంటారా లేదా కమర్షియల్ బాట పడతారా అనేది చూడాలి. ఏదేమైనా కూడా అఖిల్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క సినిమాలో ఐదుగురు హీరోయిన్లు… గ్లోబల్ మూవీస్ కొత్త ఫార్ములా..!

చిన్న సినిమాల నుంచి వందల కోట్ల సీక్వెల్స్… బ్లాక్‌బస్టర్ల కొత్త లెక్కలు..!

Yash: యష్ డబుల్ స్పీడ్.. వరుస పాన్ ఇండియా సినిమాలతో భారీ ప్లాన్..!

టాలీవుడ్‌లో గేరు మార్చిన హీరోయిన్లు… బిగ్ హిట్ కోసం భారీ ప్లాన్..!

స్టార్ హీరోల రికార్డులే… దర్శకులకు ఇప్పుడు అతిపెద్ద పరీక్ష..!

Follow Us