AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న సినిమాల నుంచి వందల కోట్ల సీక్వెల్స్... బ్లాక్‌బస్టర్ల కొత్త లెక్కలు..!

చిన్న సినిమాల నుంచి వందల కోట్ల సీక్వెల్స్… బ్లాక్‌బస్టర్ల కొత్త లెక్కలు..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 18, 2026 | 4:38 PM

Share

'బాహుబలి' తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ ట్రెండ్ కొత్త స్థాయికి చేరుకుంది. చిన్న బడ్జెట్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'తుంబాడ్', 'కాంతార', 'గూఢచారి', 'హనుమాన్' చిత్రాల కొనసాగింపులు ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. భారీ విజువల్స్, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్, పాన్ ఇండియా స్థాయి ప్రణాళికలతో ఈ సీక్వెల్స్ ప్రేక్షకులకు మరింత గొప్ప సినీ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇండియన్ స్క్రీన్ మీద బాహుబలి సెట్ చేసిన ట్రెండ్‌ ఇప్పుడు కొత్త రేంజ్‌కు వెళుతోంది. తొలి భాగం ఘన విజయం సాధించటంతో సీక్వె్ల్స్ మీద హైప్ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా బడ్జెట్ లెక్కలు భారీగా పెంచేస్తున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో ఒకప్పుడు చిన్న సినిమాలుగా వచ్చి బ్లాక్ బస్టర్స్ అయిన మూవీస్.. ఇప్పుడు పార్ట్ 2 కోసం ఏకంగా పదుల కోట్ల నుంచి వందల కోట్లకు జంప్ అవుతున్నాయి. కళ్లు చెదిరే బడ్జెట్స్ పెట్టిస్తున్న ఆ సీక్వెల్స్‌ ఏంటి..? బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి విజువల్ వండర్‌గా నిలిచిన సినిమా తుంబాడ్. కేవలం పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ కల్ట్ క్లాసిక్, ఆడియన్స్‌కు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఇన్నేళ్ల తరువాత రీసెంట్‌గా రీ-రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న తుంబాడ్ 2ను గ్రాండ్ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ పది కోట్లు అయితే, సీక్వెల్ కోసం ఏకంగా 150 కోట్లు ఖర్చు చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఫస్ట్ పార్ట్‌ను మించి ఉండేలా భారీ వీఎఫ్ఎక్స్‌తో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. సౌత్‌లోనూ ఇలాంటి సెన్సేషన్స్ ఉన్నాయి. లోకల్ నెటివిటీతో కేవలం పదహారు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కాంతార, 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త ట్రెండ్ సెట్ చేసింది. దీంతో ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ మీద రిలీజ్‌కు ముందే అంచనాలు పీక్స్‌ చేరాయి. దానికి తగ్గట్టుగానే 150 కోట్ల భారీ బడ్జెట్‌తో బిగ్ స్కేల్‌లో ఈ సినిమాను ప్లాన్ చేశారు మేకర్స్. పార్ట్ 2 కూడా బిగ్ హిట్ కావటంతో ఈ సిరీస్‌లో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అడివి శేష్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ గూఢచారి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో కేవలం ఆరు కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్ స్పై థ్రిల్లర్ తీయొచ్చా అని ప్రూవ్ చేశారు శేష్. ఫస్ట్ పార్ట్ గ్రాండ్ సక్సెస్ కావడంతో, ఇప్పుడు జీ2ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇంటర్నేషనల్ లొకేషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది జీ 2. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన జై హనుమాన్‌, కేవలం నలభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా రాబోతున్న ‘జై హనుమాన్’ కోసం బడ్జెట్ లెక్కలన్నీ మార్చేశారు మేకర్స్‌. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట నేపథ్యంలో సాగే ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఆడియన్స్‌కు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు ప్రశాంత్ వర్మ భారీ కాన్వస్‌ను సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yash: యష్ డబుల్ స్పీడ్.. వరుస పాన్ ఇండియా సినిమాలతో భారీ ప్లాన్..!

టాలీవుడ్‌లో గేరు మార్చిన హీరోయిన్లు… బిగ్ హిట్ కోసం భారీ ప్లాన్..!

స్టార్ హీరోల రికార్డులే… దర్శకులకు ఇప్పుడు అతిపెద్ద పరీక్ష..!

Follow Us