AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash: యష్ డబుల్ స్పీడ్.. వరుస పాన్ ఇండియా సినిమాలతో భారీ ప్లాన్..!

Yash: యష్ డబుల్ స్పీడ్.. వరుస పాన్ ఇండియా సినిమాలతో భారీ ప్లాన్..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 18, 2026 | 4:35 PM

Share

'కేజీఎఫ్ 2' తర్వాత విరామం తీసుకున్న రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలతో స్పీడు పెంచారు. 'టాక్సిక్', 'రామాయణ' చిత్రాలతో పాటు హేమంత్ ఎమ్ రావు, పీఎస్ మిత్రన్ ప్రాజెక్ట్‌లపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. పోలీస్ ఆఫీసర్ పాత్రతో పాటు సైన్స్ ఫిక్షన్ కథల్లోనూ కనిపించనున్న యష్, అభిమానులు ఎదురుచూస్తున్న 'కేజీఎఫ్ 3'పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాకింగ్ స్టార్ యష్ స్పీడు పెంచారు. ఆ మధ్య కాస్త గ్యాప్ తీసుకుని ఆచితూచి అడుగులేసిన యష్… ఇప్పుడు గేరు మార్చారు. ఇప్పుడు సినిమాలు సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ప్రజెంట్ టాక్సిక్ షూటింగ్‌లో ఉన్న యష్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాకింగ్ స్టార్ యష్ గేరు మార్చారు. కేజీఎఫ్ 2 సక్సెస్ తరువాత లాంగ్‌ గ్యాప్ తీసుకున్న యష్, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రజెంట్‌ గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో ‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రస్టీజియస్ మూవీ రామాయణలో రావణుడిగా కనిపించబోతున్నారు. ఆ మూవీకి కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే ‘సప్త సాగరదాచే ఎల్లో’ ఫేమ్ హేమంత్ ఎమ్ రావుతో మరో మూవీ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో యష్‌ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ రోల్‌లో కనిపించబోతున్నారన్న న్యూస్ ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమాకి యష్ స్వయంగా రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో కూడా వర్క్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ డిస్కషన్ జరుగుతుండగానే మరో ప్రాజెక్ట్ పేరు కూడా తెర మీదకు వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్, యష్‌తో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం వీటన్నింటితో పాటు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కేజీఎఫ్ 3’ పనులు కూడా త్వరలో మొదలవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్‌లో పెడుతూ జోరు చూపిస్తున్నారు రాకింగ్ స్టార్ యష్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో గేరు మార్చిన హీరోయిన్లు… బిగ్ హిట్ కోసం భారీ ప్లాన్..!

స్టార్ హీరోల రికార్డులే… దర్శకులకు ఇప్పుడు అతిపెద్ద పరీక్ష..!

Follow Us