కూకట్‌పల్లిలోని మూసాపేట్ జనతా నగర్లో తొమ్మిదో తరగతి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తనతో మాట్లాడటం లేదని ప్రేమిస్తున్న టీచర్‌కు వీడియో కాల్ చేసి, తాను చనిపోతున్నట్లు చెప్పి ఉరివేసుకుంది. తల్లిదండ్రుల మందలింపుతో టీచర్ నరేష్ బాలికను దూరం పెట్టగా, తీవ్ర మనస్థాపంతో ఈ ఘోరానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.