AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగం కోసం వెళ్లి ఉచ్చులో చిక్కింది..! ఒమన్‌లో హైదరాబాద్ మహిళ నరకయాతన!

కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆశతో విదేశాలకు వెళ్లిన ఓ మహిళకు సరియైన ఉద్యోగం దక్కలేదు.. బదులుగా వేధింపులు, దోపిడీ, ఆకలి మాత్రమే మిగిలాయి. హైదరాబాద్‌కు చెందిన షబ్నం బేగం ఒమన్‌లో ఎదుర్కొన్న దారుణ పరిస్థితులు ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఆమెను స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఉద్యోగం కోసం వెళ్లి ఉచ్చులో చిక్కింది..! ఒమన్‌లో హైదరాబాద్ మహిళ నరకయాతన!
Hyderabad Woman In Oman
Balaraju Goud
|

Updated on: Jul 18, 2026 | 10:09 PM

Share

కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆశతో విదేశాలకు వెళ్లిన ఓ మహిళకు సరియైన ఉద్యోగం దక్కలేదు.. బదులుగా వేధింపులు, దోపిడీ, ఆకలి మాత్రమే మిగిలాయి. హైదరాబాద్‌కు చెందిన షబ్నం బేగం ఒమన్‌లో ఎదుర్కొన్న దారుణ పరిస్థితులు ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఆమెను స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్‌కు చెందిన షబ్నం బేగం అనే మహిళ ఉద్యోగం పేరుతో ఒమన్‌కు వెళ్లింది. స్థానిక రిక్రూట్‌మెంట్ ఏజెంట్ నెలకు 200 ఒమానీ రియాల్స్ జీతంతో ఇంటి పనిమనిషి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో ఆమె 2026 మార్చి 26న మస్కట్‌కు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఒమన్ చేరుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు.

ఇంటి యజమాని ఆమెను రోజుకు 12 నుంచి 15 గంటల పాటు పలువురు ఇళ్లలో పనిచేయాలని బలవంతం చేశాడని, లేదంటే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు తగిన ఆహారం, వసతి కల్పించలేదని, నాలుగు నెలలుగా జీతం కూడా చెల్లించలేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా యజమాని తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని షబ్నం బేగం ఆరోపించినట్లు సమాచారం.

వేధింపులు భరించలేక యజమాని ఇంటి నుంచి తప్పించుకున్న షబ్నం ప్రస్తుతం మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నట్లు తెలిసింది. ఆమె భద్రతను నిర్ధారించి, వెంటనే హైదరాబాద్‌కు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు.

అలాగే తప్పుడు హామీలతో ఆమెను విదేశాలకు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిక్రూట్‌మెంట్ ఏజెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించే అవకాశముంది. సంబంధిత అధికారుల దర్యాప్తు అనంతరం పూర్తి వాస్తవాలు వెల్లడికానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉద్యోగం కోసం వెళ్లి ఉచ్చులో చిక్కిన హైదరాబాద్ మహిళ..!
ఉద్యోగం కోసం వెళ్లి ఉచ్చులో చిక్కిన హైదరాబాద్ మహిళ..!
'RC17'లో క్రేజీ కాస్టింగ్.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదే
'RC17'లో క్రేజీ కాస్టింగ్.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదే
మీ శరీరం ఇచ్చే ఈ సంకేతాల గురించి తెలుసా..? లైట్ తీసుకుంటే..
మీ శరీరం ఇచ్చే ఈ సంకేతాల గురించి తెలుసా..? లైట్ తీసుకుంటే..
ఇంట్లోనే ఈజీగా ముంబై స్ట్రీట్ స్టైల్ తవా పులావ్..అదిరిపోయే రెసిపీ
ఇంట్లోనే ఈజీగా ముంబై స్ట్రీట్ స్టైల్ తవా పులావ్..అదిరిపోయే రెసిపీ
అలర్ట్‌.. ఈ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఎందుకు..? ఎప్పుడంటే..!
అలర్ట్‌.. ఈ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఎందుకు..? ఎప్పుడంటే..!
జాతీయ అవార్డు విజేతలకు ఎన్టీఆర్ స్పెషల్ విషెస్..
జాతీయ అవార్డు విజేతలకు ఎన్టీఆర్ స్పెషల్ విషెస్..
ఏపీ‌లో కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌
ఏపీ‌లో కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌
తెలంగాణలో మళ్లీ భూలొల్లి.. మరో పొలిటికల్‌ సరుకు దొరికినట్టేనా?
తెలంగాణలో మళ్లీ భూలొల్లి.. మరో పొలిటికల్‌ సరుకు దొరికినట్టేనా?
మహిళలకు పండగలాంటి వార్త.. రికార్డ్‌ స్థాయిలో తగ్గుతున్న వెండి ధర!
మహిళలకు పండగలాంటి వార్త.. రికార్డ్‌ స్థాయిలో తగ్గుతున్న వెండి ధర!
మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్! ఫిక్కీ వేదికగా సీఎం రేవంత్ కీలక హామీలు
మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్! ఫిక్కీ వేదికగా సీఎం రేవంత్ కీలక హామీలు