AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: అఫీషియల్.. సిరీస్ గెలిచేందుకు చిచ్చరపిడుగును దింపిన బీసీసీఐ! వాషింగ్టన్ సుందర్ ప్లేస్‌లో వచ్చేశాడు..

ఇంగ్లాండ్‌తో మూడో వన్డేకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయపడిన వాషింగ్టన్ సుందర్ సిరీస్ నుంచి తప్పుకోగా, అతని స్థానంలో యువ ఆల్‌రౌండర్ ను బీసీసీఐ జట్టులోకి ఎంపిక చేసింది. ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్‌తో సిరీస్ విన్నర్ ఎవరో తేలిపోనుంది.

IND vs ENG: అఫీషియల్.. సిరీస్ గెలిచేందుకు చిచ్చరపిడుగును దింపిన బీసీసీఐ! వాషింగ్టన్ సుందర్ ప్లేస్‌లో వచ్చేశాడు..
Ind Vs Eng 3rd Odi
SN Pasha
|

Updated on: Jul 18, 2026 | 6:08 PM

Share

ఇంగ్లాండ్‌తో ఎంతో కీలకమైన మూడో వన్డేకు ముందు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో సిరీస్‌లోని చివరి మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో యువ ఆల్‌రౌండర్ హర్ష్ దుబేను భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డే సందర్భంగా వాషింగ్టన్ సుందర్ కుడి కాలి తొడ కండరానికి (హామ్‌స్ట్రింగ్) గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం అతడు సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తేలింది. గాయం తీవ్రతను అంచనా వేసేందుకు అతడు మరిన్ని స్కానింగ్‌లు చేయించుకోనున్నట్లు, తదుపరి చికిత్స కోసం నిపుణుల సలహా తీసుకోనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

రెండో వన్డేలో భారత్ నిర్దేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జో రూట్ 99 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. విల్ జాక్స్ కీలక భాగస్వామ్యం అందించగా, చివర్లో గస్ అట్కిన్సన్ విజయ పరుగులు నమోదు చేశాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 1-1తో సమం చేసింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ వైఫల్యంపై నిరాశ వ్యక్తం చేశాడు. తొలి 25 ఓవర్ల తర్వాత 300కు పైగా స్కోరు చేసే స్థితిలో ఉన్నప్పటికీ, మధ్య ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోవడం జట్టును దెబ్బతీసిందని పేర్కొన్నాడు.

లోయర్ మిడిల్ ఆర్డర్ నుంచి మరింత మెరుగైన ప్రదర్శన ఆశించామని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పి పెద్ద స్కోరు దిశగా సాగేందుకు ప్రయత్నిస్తామని గిల్ తెలిపాడు. ఇప్పుడు సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో ఆదివారం లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగే మూడో వన్డే ఉత్కంఠభరితంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. హర్ష్ దుబేకు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది టాస్ సమయంలో తేలనుంది.

మూడో వన్డేకు భారత జట్టు (అంచనా)

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, గర్నూర్ బ్రార్, హర్ష్ దుబే.

Follow Us