Team India: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్, విరాట్, బుమ్రా రీఎంట్రీకి రెడీ.. మ్యాచ్ ఎప్పుడంటే?
India Likely Squad Bangladesh ODI Series: బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్ భారత యువ ఆటగాళ్లతో పాటు సీనియర్లకు తమ నిలకడను నిరూపించుకోవడానికి మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎంపిక చేసిన తుది జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తుంది.

India Likely Squad Bangladesh ODI Series: సెప్టెంబర్‌లో జరగనున్న బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియాను పంపించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం దిగ్గజ ఆటగాళ్లతో కూడిన 15 మంది సభ్యుల భారత జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనకు ఎంపికయ్యే ప్రాబబుల్ టీం వివరాలు ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిద్దాం.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియాను పంపించేందుకు బీసీసీఐ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరేందుకు సిద్ధమైంది. కేంద్ర సర్కార్ నుంచి పచ్చజెండా లభిస్తే భారత జట్టు వెంటనే అక్కడకు పయనమవుతుంది. ఈ క్రమంలోనే సీనియర్లు, యంగ్ ప్లేయర్ల కలయికతో ఒక పటిష్టమైన 15 మంది సభ్యుల స్క్వాడ్‌ను సిద్ధం చేసేందుకు సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా లార్డ్స్‌లో సెంచరీతో పాత ఫామ్‌ను రీ-క్రియేట్ చేసిన రోహిత్ శర్మకు మరో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. యశస్వి జైస్వాల్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది.
కెప్టెన్‌గా గిల్ – వైస్ కెప్టెన్‌గా శ్రేయస్..
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే యోచనలో మేనేజ్‌మెంట్ ఉంది. వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ జట్టులో కొనసాగనున్నాడు. వికెట్ కీపింగ్ విభాగంలో మొదటి ప్రాధాన్యతగా కేఎల్ రాహుల్ ఉండగా, రెండో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోనున్నారు. యువత, అనుభవజ్ఞుల కలయికతో కూడిన ఈ బ్యాటింగ్ లైనప్ బంగ్లాదేశ్ పరిస్థితుల్లో భారీ స్కోర్లు సాధించడానికి బాగా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
హార్దిక్, బుమ్రా రీ-ఎంట్రీ – స్పిన్ బాధ్యతలు వీరికే..
రైట్ ఆర్మ్ పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌తో మళ్లీ వన్డే జట్టులోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయంగా మారింది. దీంతో శివమ్ దూబేకు చోటు దక్కకపోవచ్చు. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యే సూచనలు ఉన్నాయి. పేస్ విభాగానికి స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. అతడితో పాటు మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ బౌలింగ్ దళంలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో సిరాజ్‌కు జట్టులో చోటు లభించవచ్చని భావిస్తున్నారు.
ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?
గాయాలతో దూరమైన యంగ్ స్టార్స్..
యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇంకా గాయాల నుంచి పూర్తిస్థాయిలో కోలుకోలేదు. దాంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు బంగ్లాదేశ్ పర్యటనకు అందుబాటులో ఉండటం కష్టమేనని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నాటికి వీరిద్దరూ ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు కనిపించడం లేదు. అన్ని కుదిరితే టీమిండియా 15 మంది సభ్యుల అంచనా స్క్వాడ్ ఇలా ఉండవచ్చు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




