AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌కి దోస.. ఇడ్లీ.. బోర్ కొడితే అప్పటికప్పుడు ఇలా ఉల్లి బోండా ట్రై చేయండి! రుచి అదిరిపోద్ది

ఉల్లిపాయ బోండాను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. నోటికి కమ్మగా, రుచికరంగా ఉండే ఈ అల్పాహారం లేదా స్నాక్ కోసం ఉల్లిపాయలు, పెరుగు, గోధుమపిండి, బియ్యం పిండి వంటి సామాగ్రిని ఉపయోగించి చక్కటి బ్యాటర్‌ను సిద్ధం చేసుకోవచ్చు. అతి తక్కువ సమయంలోనే ఈ రుచికరమైన బోండాను సిద్ధం చేసుకోండి..

Srilakshmi C
|

Updated on: Sep 20, 2026 | 5:30 PM

Share
నోటికి కమ్మగా, రుచికరమైన స్నాక్ లేదా బ్రేక్‌ఫాస్ట్ కోసం వెతుకుతున్నారా? అయితే ఉల్లిపాయ బోండా మీకు సరైన ఎంపిక. దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఉల్లిపాయలు, పిండి, కొన్ని మసాలాలు ఉంటే చాలు..

1 / 5
ముందుగా మూడు ఉల్లిపాయలను తీసుకుని, వాటిని సన్నగా, పొడవుగా కట్ చేసుకోవాలి. బోండా రుచికి ఈ పొడవైన తరుగు చాలా ముఖ్యం.

2 / 5
కట్ చేసిన ఉల్లిపాయలను విడివిడిగా అయ్యేలా గట్టిగా ప్రెస్ చేసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లో పావు కప్పు పుల్లని పెరుగును తీసుకుని, ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి. పుల్లని పెరుగు బోండాకు మంచి రుచిని ఇస్తుంది.

3 / 5
తరువాత, ఈ పెరుగు మిశ్రమంలో ఒక కప్పు గోధుమపిండి (లేదా మైదాపిండి), పావు కప్పు బియ్యం పిండి కలపాలి. అలాగే సన్నగా తురుముకున్న అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను వేసి అన్నీ బాగా కలిసేలా చూసుకోవాలి. పిండి అంతా కలిసిన తర్వాత, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ బ్యాటర్‌ను సిద్ధం చేసుకోవాలి.

4 / 5
బ్యాటర్ మరీ పల్చగా లేదా మరీ చిక్కగా ఉండకూడదు. వీడియోలో చూపించిన విధంగా సరైన పదునులో బ్యాటర్‌ను తయారుచేసుకోవడం ముఖ్యం. ఇలా సిద్ధం చేసుకున్న బ్యాటర్‌తో నోటికి రుచికరమైన ఉల్లిపాయ బోండాలను తయారుచేసుకోవచ్చు.

5 / 5
Follow Us