AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ ఛాన్స్ వస్తే మాత్రం వెళ్ళాను.. సీరియల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

బుల్లితెరపై తమదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యే నటీనటులు చాలామందే ఉన్నారు. అయితే కొందరు మాత్రం సీరియల్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ షోల ద్వారా కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తాజాగా ఈ బ్యూటీ బిగ్ బాస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ ఛాన్స్ వస్తే మాత్రం వెళ్ళాను.. సీరియల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 20, 2026 | 5:37 PM

Share

బుల్లితెరపై తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సీరియల్ నటి కావ్యశ్రీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓవైపు సినిమాల్లో స్టార్ హీరోలతో కలిసి నటించాలని తన కోరికను వెల్లడిస్తూనే.. మరోవైపు బిగ్ బాస్‌ షో విషయంలో మాత్రం తన నిర్ణయం ఏంటో స్పష్టంగా చెప్పేశారు. ముఖ్యంగా బిగ్ బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వస్తే వెళ్తారా.? అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ కార్యక్రమాన్ని తాను ప్రేక్షకురాలిగా ఎంతో ఇష్టంగా చూస్తానని కావ్యశ్రీ తెలిపారు. షోలో జరిగే టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలు, ఆసక్తికరమైన సంఘటనలను చూడటం తనకు నచ్చుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే అదే బిగ్ బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టే అవకాశం వస్తే మాత్రం తాను వెళ్లాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. బిగ్ బాస్‌ను ప్రేక్షకురాలిగా ఎంజాయ్ చేయడం వేరు.. హౌస్‌లోకి వెళ్లి అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడం వేరని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఏం పాటరా బాబు..! యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపించేలా ఉందిగా

బిగ్ బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండకపోవచ్చని కావ్యశ్రీ అభిప్రాయపడ్డారు. సాధారణ జీవితంలో ప్రశాంతంగా, పద్ధతిగా ఉండే వ్యక్తులు సైతం హౌస్‌లోని ఒత్తిడి, టాస్కులు, విభేదాల కారణంగా భిన్నంగా స్పందించే అవకాశం ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. “బయట మనం చాలా ప్రశాంతంగా ఉంటాం.. కానీ బిగ్ బాస్ హౌస్‌లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చెప్పలేం. గొడవలు, వివాదాల కారణంగా మన ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే నేను బిగ్ బాస్‌ను టీవీలో ప్రేక్షకురాలిగా చూడటానికే ఇష్టపడతాను. కంటెస్టెంట్‌గా మాత్రం వెళ్లాలని అనుకోవడం లేదు” అని కావ్యశ్రీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్.. ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ

కావ్యశ్రీ ఇటీవల తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలపై స్పందిస్తూ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాలనేది తన కోరికగా వెల్లడించినట్లు తెలుస్తోంది. తనకు ఇష్టమైన హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని ఆమె తెలిపింది. అలా సినిమాల విషయంలో తన కోరికలను బహిరంగంగా చెప్పిన కావ్యశ్రీ.. బిగ్ బాస్‌ విషయంలో మాత్రం తన నిర్ణయం పూర్తిగా భిన్నంగా ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం కావ్యశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్‌ షోను అభిమానించే ఆమె.. అదే షోలో కంటెస్టెంట్‌గా మాత్రం ఎందుకు వెళ్లకూడదనుకుంటున్నారనే అంశంపై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

చిరంజీవికి జోడిగా అందాల భామ.. మొదటిసారి మెగాస్టార్‌ సరసన సీనియర్ హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us