Sayaji Shinde: నా వైఫ్‌నే నా కూతురంటూ ఎగతాళి చేసేవాళ్లు
తనకంటే 15 ఏళ్లు చిన్నదైన అల్కాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నటుడు సాయాజీ షిండే, వయసు తేడా కారణంగా ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్నేహితులు భార్యను కూతురిగా భావించి ఆటపట్టించేవారని వెల్లడించారు. మరోవైపు అల్కా కూడా కుటుంబం తొలుత వయసు వ్యత్యాసంపై సందేహపడినా, తర్వాత అందరూ సయాజీని అంగీకరించారని చెప్పారు.
సినీ పరిశ్రమలో తమకంటే చిన్నవారిని లేదా పెద్దవారిని వివాహం చేసుకున్న నటులు చాలా మంది ఉన్నారు. పది నుంచి పన్నెండేళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, చాలా మంది నటులు వివాహం చేసుకుని ఆనందంగా జీవిస్తున్నారు. అయితే ఇదే ఏజ్ గ్యాప్ కారణంగా ట్రోలింగ్ ను ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు. టాలీవుడ్ నటుడు సాయాజీ షిండే కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. తెలుగుతో పాటు మరాఠీ, హిందీ, దక్షిణాది భాషల్లో సినిమాలు చేసిన ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే సయాజీ కంటే ఆయన భార్య వయసులో 15 ఏళ్లు చిన్నది. ఈ నేపథ్యంలో ఏజ్ గ్యాప్ విషయంలో స్నేహితులు ఎలా ఆట పట్టించేవారో ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారీ విలక్షణ నటుడు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే… ‘మా ఇద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉంది. దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. అందుకే పెళ్లి తర్వాత నా భార్యను పట్టుకుని ‘మీ అమ్మాయా?’ అని నా స్నేహితులు నన్ను ఆటపట్టించేవారు’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సాయాజీ భార్య కూడా ఈ విషయంపై రియాక్టయ్యారు. ఈమె ఏం అన్నారంటే… ‘నా తోబుట్టువులందరూ నాకంటే పెద్దవారు. మా నాన్నగారు చనిపోయక ఒక సందర్భంలో నేను, సాయాజీ కలిశాం. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆ సమయంలో మా అన్నయ్యకు ఒకే ఒక సమస్య కనిపించింది, అదే వయసు. మా ఇద్దరి మధ్య పదిహేను సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. అందుకే ‘నువ్వెలా సర్దుకుంటావు?’ అని నన్ను అడిగారు. కానీ ఆయన మా ఫ్యామిలీని కలిశాక అంతా సర్దుకుపోయింది. మా ఇంట్లో వారందరూ సయాజీని మెచ్చుకున్నారు’ అని చెప్పుకొచ్చింది. సాయాజీ, అల్కా మొదటిసారి ఒక ఆసుపత్రిలో కలుసుకున్నారు. ఒకసారి, అల్కా బావ చేరిన అదే ఆసుపత్రిలో సయాజీ కూడా చేరారని ఆమెకు తెలిసింది. అల్కా సాయాజీ షిండేకు పెద్ద అభిమాని. అందుకే ఆమె అతన్ని కలిసింది. అప్పుడు సాయాజీ ఆమెను ఏ పుస్తకం చదువుతున్నావని అడిగాడు. అప్పుడు ఆమె ఒక పుస్తకం చదువుతున్నానని చెప్పగా, సాయాజీ కూడా తాను కూడా చదువుతానంటూ ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత, రెండు మూడు నెలలకు, సయాజీ ఆ పుస్తకాన్ని తిరిగి తీసుకోవడానికి అల్కాను పిలిచాడు. అలా వారిద్దరూ స్నేహితులయ్యారు. పుస్తకాలు ఇచ్చిపుచ్చునే క్రమంలోనే వారి ద్దరి మనసులు కలిశాయి. స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. సాయాజీ షిండే భార్య, అల్కా షిండే ల వివాహం 2002లో జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సింపుల్‌గా సమంత సీమంతం వేడుక!
The Odyssey craze: షాకింగ్.. సినిమా చూడడం కోసం ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకున్న లేడీ
Fauzi: ‘ఫౌజీ’తో ప్రభాస్ వార్ మొదలు.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్‌తో పాన్ ఇండియా హంగామా..!
‘వారణాసి’ తర్వాత జక్కన్న ప్లాన్ ఏంటి?… నెక్ట్స్ హీరోపై మొదలైన భారీ చర్చ..!
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

