AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్రే.. ఇన్నాళ్లూ ఈ విషయం తెలీక పొరపాటు చేసాం.. మిగిలిన అన్నంతో.. విపరీతంగా పూసే మల్లె పూలు!

ఇళ్లల్లో మొక్కలను, ముఖ్యంగా పూల మొక్కలను పెంచుకోవడం అందరికీ ఎంతో ఇష్టం. పూల మొక్కల విషయానికి వస్తే మల్లె మొక్క లేని ఇల్లు దాదాపుగా ఉండదు. మల్లెపూల సువాసన మన మనస్సుకు ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది. అయితే చాలా మంది ఇళ్లల్లో మల్లె మొక్కలు సరిగ్గా పెరగవు లేదా మొగ్గలు రాకుండా కేవలం ఆకులు మాత్రమే వస్తుంటాయి. మరికొందరు అన్-సీజన్ లో మల్లెపూలు అస్సలు పూయవని అనుకుంటారు.

Phani CH
|

Updated on: Jul 18, 2026 | 8:40 PM

Share
కానీ మన వంటింట్లో మిగిలిపోయిన లేదా పాచిపోయిన అన్నంతో ఒక అద్భువమైన ఉచిత ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేసి మొక్కకు అందిస్తే, ఏ సీజన్ లోనైనా మల్లె మొక్క విపరీతంగా మల్లెపూలతో విరబూస్తుంది.  ఈ అద్భుతమైన కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్ చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లోని మల్లె మొక్క గుబురుగా పెరగడమే కాకుండా తెల్లటి రోజా పువ్వుల సైజులో పెద్ద పెద్ద మల్లెపూలు పూయడం ఖాయం.

1 / 5
ఈ సహజ సిద్ధమైన ద్రావణ ఎరువు తయారీ కోసం మనం కిచెన్ లో మిగిలిపోయిన ఒక పిడికెడు తెల్ల అన్నాన్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉప్పు, నూనె లేదా మసాలాలు కలిపిన అన్నాన్ని ఈ ఫెర్టిలైజర్ కు అస్సలు ఉపయోగించకూడదు. కేవలం సాదా అన్నాన్ని మాత్రమే వాడాలి. ఈ పిడికెడు అన్నానికి కొద్దిగా పుల్లటి మజ్జిగను జోడించాలి.

2 / 5
ఇందుకు అన్నాన్ని చేత్తో బాగా మెత్తగా మెదిపి, అందులో నాలుగు ఐదు రోజుల పాటు బాగా పులియబెట్టిన పుల్లటి మజ్జిగను పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలో పోసి మూత పెట్టి మరో నాలుగు ఐదు రోజుల పాటు నీడలో బాగా పులియబెట్టాలి. ఇలా పులియబెట్టడం వల్ల అందులో మొక్కలకు మేలు చేసే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వంటి ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు విపరీతంగా వృద్ధి చెందుతాయి.

3 / 5
నాలుగు రోజుల తర్వాత ఈ ఒక లీటరు పులిసిన అన్నం ద్రావణానికి పది లీటర్ల సాధారణ నీటిని కలిపి బాగా పలుచగా చేసుకోవాలి. ఈ శక్తివంతమైన లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను ఉపయోగించే ముందు మల్లె మొక్క కుండీలోని పై మట్టి లేయర్ ను ఒక చిన్న టూల్ సహాయంతో మెల్లగా కదిలించాలి. ఇలా చేయడం వల్ల మట్టిలో ఉండే కలుపు మొక్కలు తొలగిపోవడమే కాకుండా వేర్లకు గాలి, వెలుతురు చక్కగా అందుతాయి. ఇప్పుడు మొక్క మొదట్లో తగినన్ని నీళ్లు పోసి, ఆ తర్వాత ఈ తయారు చేసుకున్న అన్నం మజ్జిగ ద్రావణాన్ని వేరు వ్యవస్థకు బాగా అందేలా పోయాలి. అలాగే ఈ లిక్విడ్ ను ఒక స్ప్రే బాటిల్ లో పోసి ఆకులపై కూడా బాగా స్ప్రే చేసుకోవచ్చు.

4 / 5
ఈ జీవామృతాన్ని మీ మల్లె మొక్కకు అందించడం వల్ల వేరు వ్యవస్థ ఎంతో బలంగా మారుతుంది. మట్టి సారవంతంగా మారి మొక్కకు కావలసిన తేమను నిలుపుకునే సహజ శక్తి పెరుగుతుంది. ఆకులు పచ్చగా మారి గుత్తులుగా మొగ్గలు రావడం ప్రారంభమవుతుంది. ఈ ఫెర్టిలైజర్‌ను గులాబీ, మందార, కనకాంబరాలు వంటి పూల మొక్కలకు ఇవ్వవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా సంపూర్ణ ఆర్గానిక్ పద్ధతిలో మీ గార్డెన్‌ను అందమైన పూలతో నింపుకోవడానికి ఈ సులభమైన కిచెన్ చిట్కాలను అస్సలు మిస్ కాకుండా మీ ఇంట్లోనే తయారు చేసుకుని ఆనందంగా ఆస్వాదించండి.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!