ప్రస్తుతం ఎందరో మధుమేహంతో బాధపడుతున్నారు. జీవితకాలం మందులు వాడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సహజంగా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయల్లోని క్వార్సెటిన్, సల్ఫర్ సమ్మేళనాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి.