AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుడ్‌న్యూస్.. బ్లడ్ షుగర్‌ ఈజీగా తగ్గాలంటే.. సర్వేలో సంచలన విషయాలు..

మధుమేహానికి ప్రధాన కారణం అధిక బరువు పెరగడంతోపాటు సరైన జీవనశైలిని పాటించకపోవడం. మధుమేహాన్ని అదుపు చేసేందుకు ప్రజలు చాలా ప్రయత్నిస్తుంటారు. ఇటీవలి పరిశోధన ప్రకారం, కేవలం 15 నిమిషాల్లో రక్తంలో చక్కెరను నియంత్రించే ఫ్రూట్ డ్రింక్ ఒకటి వెలుగులోకి వచ్చింది.

Health Tips: మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుడ్‌న్యూస్.. బ్లడ్ షుగర్‌ ఈజీగా తగ్గాలంటే.. సర్వేలో సంచలన విషయాలు..
Diabetic Juice
Follow us
Venkata Chari

|

Updated on: Jul 16, 2022 | 8:55 PM

ప్యాంక్రియాస్ చాలా తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేసినప్పుడు టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్. టైప్ 2 డయాబెటిస్‌లో, రక్తంలో గ్లూకోజ్ ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ఇన్సులిన్ తన పనిని సరిగ్గా చేయలేనప్పుడు, రక్త కణాలలో గ్లూకోజ్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. శరీరం చక్కెరను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు లేదా శరీరం ఇన్సులిన్‌ను ఉపయోగించలేనప్పుడు టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, మీ ఆహారం మాత్రమే రక్తంలో చక్కెరను నియంత్రించగలదు. పరిశోధన ప్రకారం, రుచికరమైన పానీయం మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

పరిశోధనల్లో ఏం తేలిదంటే?

జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కరెంట్ డెవలప్‌మెంట్స్ ఇన్ న్యూట్రిషన్, సుమారు 236 ml (ఎనిమిది ఔన్సుల) దానిమ్మ రసం తాగిన వారి రక్తంలో చక్కెర తగ్గుతుంది. ఈ పరిశోధనలో 21 మంది ఆరోగ్యవంతులపై పరిశోధనలు చేశారు. పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులకు దానిమ్మ రసంతోపాటు నీరు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

పరిశోధనలో పాల్గొన్న వాలంటీర్లను ఫాస్టింగ్‌ సమయంలోని సీరం ఇన్సులిన్ స్థాయిల ఆధారంగా రెండు గ్రూపులుగా విభజించారు. దానిమ్మ రసాన్ని సేవించే వారి రక్తంలో చక్కెర తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. తక్కువ ఫాస్టింగ్ సీరమ్ ఇన్సులిన్ ఉన్నవారి బ్లడ్ షుగర్ కేవలం 15 నిమిషాల్లో తగ్గిపోయింది.

దానిమ్మ రసంలో ఉండే సమ్మేళనాలు ప్రజల గ్లూకోజ్ జీవక్రియను నియంత్రించగలవని పరిశోధకులు నిర్ధారించారు. దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇది కాకుండా, దానిమ్మపండులో ఆంథోసైనిన్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది దాని రంగును ముదురు ఎరుపుగా చేస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్ చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దానిమ్మ రసం, రక్తంలో చక్కెర స్థాయిల వెనుక ఉన్న విధానాలు పూర్తిగా స్పష్టంగా లేనప్పటికీ, దాని ప్రభావాల గురించి మరింత తెలుసుకోవడానికి పరిశోధన అవసరం అని నిపుణులు భావిస్తున్నారు.

న్యూట్రిషన్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధనలో దానిమ్మ రసం ముదురు రంగులో ఉన్నందున, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో సీరం గ్లూకోజ్, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో ఫాస్టింగ్ సహాయపడుతుందని కనుగొన్నారు.

టైప్ 2 డయాబెటిస్ ప్రధాన లక్షణాలు..

  1. – సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం
  2. – నిత్యం దాహం వేయడం
  3. – ఆకస్మికంగా బరువు తగ్గడం
  4. – ప్రైవేట్ భాగాల చుట్టూ దురద రావడం
  5. – గాయం నెమ్మదిగా మానడం
  6. – చూపు కోల్పోవడం

మీరు ఈ లక్షణాలలో దేనితోనైనా బాధపడుతుంటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించాలి. సరైన సమాచారం కోసం, వైద్యుడిని సంప్రదించి, షుగర్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచింది.

గమనిక: ఈ సమాచారం పరిశోధన ఆధారంగా అందించాం. ఏదైనా పద్ధతి, మెడిసిన్స్ పాటించే ముందు వైద్యుడిని సంప్రదించండి.