AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Boosting Foods: మీ పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడాలంటే.. నేరేడు పండ్లు, పెరుగు ఇంకా..

పిల్లలు మట్టి ముద్దల్లాంటి వాళ్లు.. వాళ్లను ఎలా మలిచితే అలా తయారవుతారని పెద్దలంటూ ఉంటారు. అంటే మనం ఏం చెబితే అవే వాళ్ల మెదడులో శాశ్వతంగా నాటుకుపోతాయి. అందువల్ల పిల్లల మానసిక, మేధో వృద్ధికి మంచి అలవాట్లను నేర్పించడం చాలా అవసరం. అలాగే మంచి ఆహారం..

Brain Boosting Foods: మీ పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడాలంటే.. నేరేడు పండ్లు, పెరుగు ఇంకా..
Brain Boosting Foods
Srilakshmi C
|

Updated on: Jul 16, 2022 | 7:22 PM

Share

Brain Boosting Foods for Children: పిల్లలు మట్టి ముద్దల్లాంటి వాళ్లు.. వాళ్లను ఎలా మలిచితే అలా తయారవుతారని పెద్దలంటూ ఉంటారు. అంటే మనం ఏం చెబితే అవే వాళ్ల మెదడులో శాశ్వతంగా నాటుకుపోతాయి. అందువల్ల పిల్లల మానసిక, మేధో వృద్ధికి మంచి అలవాట్లను నేర్పించడం చాలా అవసరం. అలాగే మంచి ఆహారం శారీరక అభివృద్ధితో పాటు ప్రవర్తన, మేధో వికాసం కూడా మెరుగుపడుతుంది. పౌష్టికాహారం జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. పోషకాహారంలోని ప్రోటీన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పిల్లల శారీరక, మానసిక వికాసంలో ప్రథమ పాత్ర పోషిస్తాయి. మెదడుకు పోషణనిచ్చి, ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. పిల్లల మేధో శక్తి పెరుగుదలకు ఉపయోగపడే ముఖ్యమైన ఆహారాలు మీకోసం..

గుడ్డు రోజుకో గుడ్డు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. గుడ్లలో పోషకాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. గుడ్లు తినడం వల్ల మెదడులో ‘సెరోటోనిన్’ అనే హార్మోన్ ఉత్పత్తికి సహాయపడతాయి. దీని వల్ల పిల్లలు రోజంతా సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు.

చేప చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, అయోడిన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చేపలను తినడం ద్వారా, శరీరానికి అవసరమైన మూలకాలు సమృద్ధిగా అంది మెదడు పనితీరులో కీలకంగా వ్యవహరిస్తాయి. మానసిక స్థితిని కూడా నియంత్రించి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉన్నందున, వీటిని తినే పిల్లలు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం చాలా తక్కువని అధ్యయనాలు తెల్పుతున్నాయి.

ఇవి కూడా చదవండి

నేరేడు పండ్లు ఈ కాలంలో నేరేడు పండ్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటిల్లోని ఆంథోసైనిన్ అనే పదార్ధం మెదడు చురుకుదనాన్ని పెంచి, మేధో, మానసిక వికాసానికి దోహదపడుతుంది. మధుమేహం, గుండె జబ్బులు, చర్మ, కడుపు రుగ్మతలను నివారించడంలో ఉపయోగపడుతుంది. బెండకాయ తినడం వల్ల మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

పెరుగు పాలు, పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పెరుగు మెదడుకు చాలా మేలు చేస్తుంది. పెరుగులో ఉండే అయోడిన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. పెరుగులో ప్రోటీన్, జింక్, బి12, సెలీనియం అధికంగా ఉంటాయి.

నారింజ నారింజలో మెదడుకు మేలు చేసే విటమిన్ సి నిండుగా ఉంటుంది. పిల్లల ఆహారంలో నారింజను చేర్చడం వల్ల చురుకుగా ఉంటారు. ఇది ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

తాజా ఆరోగ్య, జీవన శైలి వార్తల కోసం క్లిక్ చేయండి.