శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చాలా మంది చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో దీని వాడకం ఎక్కువయ్యిందని చెప్పవచ్చు
TV9 Telugu
బెల్లం వాడకం ఎక్కువవడం వల్ల బెల్లం కల్తీ సమస్య కూడా పెరుగుతోంది. బెల్లం తయారీలో చక్కెర పొడి, చాక్ పొడి, బేకింగ్ సోడా వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల బెల్లం మంచి రంగులో కనిపించడంతో బరువుగా కూడా ఉంటుంది
TV9 Telugu
బేకింగ్ సోడా వంటి పదార్థాలు వెంటనే బయటకు కనిపించకపోయినా బెల్లం నాణ్యత, సహజ గుణాలు తగ్గిపోతాయి. ఇటువంటి కల్తీ బెల్లాన్ని వాడడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం ఉంటుంది
TV9 Telugu
బెల్లం నాణ్యతను తెలుసుకోవడానికి ముందుగా కొద్దిగా బెల్లాన్ని తీసుకుని మెత్తగా చేయాలి. దాదాపు పావు టీ స్పూన్ బెల్లాన్ని ఒక చిన్న గ్లాస్ లో తీసుకోవాలి
TV9 Telugu
తరువాత ఇందులో 3 ఎమ్ఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేయాలి. తరువాత జరిగే ప్రతిచర్యను గమనించాలి. బుడగలు రాకపోతే బెల్లం స్వచ్చమైనది అని అర్థం. ఒకవేళ బుడగలు వస్తే బెల్లం కల్తీ అని అర్థం
TV9 Telugu
బెల్లంలో సోడియం బైకార్బోనేట్ (బేకింగ్ సోడా) ఉంటే అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో కలిసి ప్రతిచర్యగా కార్బన్ డై యాక్సైడ్ ను విడుదల చేస్తుంది. ఈ గ్యాస్ కారణంగా బుడగలు ఏర్పడతాయి
TV9 Telugu
ఇది బెల్లం కల్తీని తెలియజేస్తుంది. ఈ చిన్న పరీక్ష ద్వారా బెల్లం నాణ్యతను తెలుసుకోవచ్చు. కల్తీ బెల్లాన్ని వాడడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి బెల్లం కొనే ముందు బెల్లం ప్యాకెట్ పై FSSAI లైసెన్స్ నంబర్ ఉందో లేదో చూసుకోవాలి. కొద్దిగా గోధుమరంగు లేదా గాఢ రంగు బెల్లం తీసుకోవడం మంచిది