- Telugu News Photo Gallery Emergency: Kangana Ranaut film’s FIRST look as former PM Indira Gandhi, Heres 9 Actresses Who Played Indira Gandhi On Screen
Emergency Movie: ఇందిరా గాంధీ పాత్రలో కంగనా ఫస్ట్ లుక్.. ఇప్పటివరకు ఎంత మంది ఈ పాత్రలో నటించారో తెలుసా?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కొత్త సినిమా ఎమర్జెన్సీ నుంచి ఫస్ట్ లుక్ ఫొటో విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనులు బిజీగా ఉంది. ఈ సినిమాలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ సందర్భంగా.. కంగనా కంటే ముందే చాలా మంది హీరోయిన్లు..
Updated on: Jul 14, 2022 | 3:16 PM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కొత్త సినిమా ఎమర్జెన్సీ నుంచి ఫస్ట్ లుక్ ఫొటో విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనులు బిజీగా ఉంది. ఈ సినిమాలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ సందర్భంగా.. కంగనా కంటే ముందే చాలా మంది హీరోయిన్లు ఇందిరా గాంధీ పాత్రను పోషించి, ఆయా సినిమాల్లో పాత్రను రక్తి కట్టించారు.

1975లో సంజీవ్ కుమార్ తెరకెక్కించిన 'ఆంధీ' సినిమాలో సుచిత్రా సేన్ పవర్ ఫుల్ లీడర్‌గా ఇందిరాగాంధీ పాత్రలో కనిపించారు.

అక్షయ్ కుమార్ నటించిన 'బెల్ బాటమ్' చిత్రంలో లారా దత్తా కూడా ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. లారా దత్తా ఈ పాత్రలో ఎంతగా ఒదిగిపోయారంటే.. ఇంధిరా గాంధీ లుక్‌లో ఆమెను గుర్తించడం చాలా కష్టం.

నటి అవంతిక అకార్కర్ చాలా కొద్ది సినిమాల్లో మాత్రమే నటించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన Bal Thackeray biopicలో అవంతిక ఇందిరా గాంధీ పాత్రలో అదరగొట్టారు.

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ 'పీఎం నరేంద్ర మోదీ' చిత్రంలో ప్రముఖ టీవీ నటి కిషోరి షహానే.. ఇందిరా గాంధీ పాత్రలో ఒదిగిపోయారు.




