Health Benefits of Maize: మాన్‌సూన్ సూపర్‌ఫుడ్‌గా మొక్కజొన్న.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?
Health Benefits of Maize: ఇతర సీజన్లతో పోల్చుకుంటే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలోని మార్పులు, తేమ పలు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. జలులు, దగ్గు, కలరా లాంటి సమస్యలు
Health Benefits of Maize: ఇతర సీజన్లతో పోల్చుకుంటే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలోని మార్పులు, తేమ పలు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. జలులు, దగ్గు, కలరా లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వీటి నుంచి దూరంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగామొక్కజొన్న వంటి సూపర్‌ఫుడ్‌ను బాగా తీసుకోవచ్చు. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు మొక్కజొన్నను చాట్, సూప్‌లో కూడా చేర్చవచ్చు. అదేవిధంగా వేయించుకుని కూడా తినవచ్చు. ఇందులో మాంగనీస్, జింక్, ఫాస్పరస్, విటమిన్ B5, విటమిన్ B6 సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి కంటి చూపును పెంచడంలో సహాయపడతాయి. శరీరంలోని రక్తహీనతను తొలగిస్తాయి. మరి వర్షాకాలంలో మొక్కజొన్న తినడం వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
గుండె, ఎముకలకు మేలు
మొక్కజొన్నలో మెగ్నీషియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. అదేవిధంగా అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.
ఇమ్యూనిటీని పెంచడంలో..
మొక్కజొన్నలోని పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇందులో ఫెరులిక్ యాసిడ్‌తో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు విరివిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ లక్షణాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో కూడా సహాయపడతాయి.
బరువు తగ్గడం కోసం..
మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీని కారణంగా ఆకలి కోరికలు అదుపులో ఉంటాయి. ఫలితంగా వేగంగా బరువు తగ్గవచ్చు.
రక్తహీనత దూరం..
మొక్కజొన్నలో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అదేవిధంగా ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది కొత్త రక్తకణాల ఏర్పాటులో సహాయపడుతుంది. ఫలితంగా రక్త హీనత సమస్యలు దూరమవుతాయి.
నాడీ వ్యవస్థ పనితీరు..
మొక్కజొన్న తీసుకుంటే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తాయి.
యాంటీ ఏజింగ్ కోసం
మొక్కజొన్న గింజల్లో ఫినోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్ వంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ సమస్యను దూరం చేయడంలో సహాయపడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ముఖంపై ముడతలు తొలగించడంలో సహాయపడతాయి. అదేవిధంగా శరీరంలో కొల్లాజెన్ స్థాయులను పెంచుతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి