- Telugu News Photo Gallery Fat Burning Tips Weight loss fat can burn by these nutrients rich desi indian superfoods Telugu Health News
Fat Burn Tips: బరువు తగ్గాలని ఫిక్స్ అయ్యారా? అయితే, ఈ 5 ఫుడ్స్ మీకు హెల్ప్ చేస్తాయి..!
Fat Burn Tips: చాలా మంది బరువు తగ్గేందుకోసమని.. మొత్తం ఆహారమే తినకుండా డైట్ చేస్తుంటారు. అయితే, అది పోషకాల కొరతకు దారి తీసి అనారోగ్య సమస్యలు..
Updated on: Jul 16, 2022 | 2:29 PM

Birds: మనం రోజూ చూస్తేనే ఉంటాం. ఉదయాన్నే పక్షులు కిలకిలరావాలు చేస్తుంటాయి. పెద్దగా అరుస్తుంటాయి. ఆ అందమై పక్షుల అరుపులతోనే గ్రామాల్లో చాలా మంది నిద్ర లేస్తుంటారు. అయితే, పక్షలు ఉదయాన్ని అరవడం వెనుక సైన్స్ పరమైన కారణం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైన్స్ భాషలో దీనిని హమ్మింగ్ అంటారు. పక్షులు ఉదయాన్నే హమ్మింగ్ చేయడానికి వేరే కారణాలు ఉన్నాయట. మరి ఆ కారణం ఏంటి? అవి ఎందుకు హమ్మింగ్ చేస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం..

సైన్స్ ABC నివేదిక ప్రకారం.. పక్షుల కిలకిలరావాలకు హార్మోన్ల హెచ్చుతగ్గులు ఒక కారణంగా పేర్కొన్నారు. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. సాయంత్రం, రాత్రి సమయంలో నిద్ర హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఉదయం సమీపిస్తున్న కొద్దీ, ఈ హార్మోన్ స్థాయి వేగంగా తగ్గుతుంది. ఇది నిద్ర ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా పక్షులు అరవడం ప్రారంభిస్తాయి. అలా అరవడం వల్ల పక్షులు మరింత శక్తిని పొందుతాయి.

పక్షులు ఇలా అరవడానికి ఆండ్రోజెన్ అనే హార్మోన్ కారణమని మరో పరిశోధన చెబుతోంది. ఆండ్రోజెన్లు సెక్స్ హార్మోన్ల సమూహం. పక్షులలో ఈ హార్మోన్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, అవి సంభోగం కోసం సిద్ధమవుతాయి. మగ పక్షి ఉదయం పూట పెద్ద గొంతుతో హమ్ చేస్తే.. వాటిలో ఈ హార్మోన్ స్థాయి పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మరోవైపు, మగ పక్షి వాయిస్ వినడం వలన.. ఈ హార్మోన్ స్థాయి ఆడ పక్షుల్లో కూడా పెరుగుతుంది.

కొన్ని జాతుల పక్షులకు హమ్మింగ్ చేయడానికి కూడా ఒక సమయం ఉంది. ఉదాహరణకు, ఏప్రిల్ నుండి జూన్ వరకు మినా జాతుల పక్షుల సంతానోత్పత్తి కాలం. ఈ సమయంలో అవి ఉదయం వేళ ఎక్కువ అరుస్తుంటాయి. అయితే పిచ్చుక ఏడాది పొడవునా హమ్ చేస్తుంటుంది. ఇక ఉదయం పూట వాటి గొంతు కాస్త ఎక్కువగానే ఉంటుంది.

చాలా పక్షులు రాత్రిపూట చనిపోతాయని ఒక పరిశోధనలో తేలింది. ఇలాంటి ఘటన జరిగినప్పుడు.. ఉదయం సమయంలో మరొక పక్షి పెద్ద స్వరంతో అరుస్తూ చుట్టుపక్కల ఉన్న పక్షులకు ఈ విషయం చెబుతుంది.




