AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Meena: ఆ దేవుడు మిమ్మల్ని త్వరగా తీసుకెళ్లాడు.. పెళ్లి రోజున నటి మీనా ఎమోషనల్‌..

Actress Meena: గత నెలలో మీనా భర్త విద్యాసాగర్‌ (Vidyasagar) హఠాన్మరణం చెందారు. ఈ ఏడాది ప్రారంభంలో కొవిడ్‌ బారిన పడిన ఆయన కోలుకున్నప్పటికి పోస్ట్‌ కోవిడ్‌, ఊపరితిత్తుల సమస్యలు వెంటాడాయి. లంగ్స్‌కు ఇన్ఫెక్షన్ సోకడంతో..

Actress Meena: ఆ దేవుడు మిమ్మల్ని త్వరగా తీసుకెళ్లాడు.. పెళ్లి రోజున నటి మీనా ఎమోషనల్‌..
Actress Meena
Basha Shek
|

Updated on: Jul 15, 2022 | 2:36 PM

Share

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మీనా (Meena). ఆతర్వాత హీరోయిన్‌గా స్టార్‌ హీరోలతో సమానంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. వివాహం అనంతరం కొంతకాలం నటనకు బ్రేక్‌ ఇచ్చినప్పటికీ మళ్లీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో సహనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. ఓవైపు సినిమాలు, మరోవైపు భర్త పిల్లలతో సరదాగా సాగిపోతున్న ఆమె కుటుంబంలో అనుకోని విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గత నెలలో మీనా భర్త విద్యాసాగర్‌ (Vidyasagar) హఠాన్మరణం చెందారు. ఈ ఏడాది ప్రారంభంలో కొవిడ్‌ బారిన పడిన ఆయన కోలుకున్నప్పటికి పోస్ట్‌ కోవిడ్‌, ఊపరితిత్తుల సమస్యలు వెంటాడాయి. లంగ్స్‌కు ఇన్ఫెక్షన్ సోకడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. దురదృష్టవశాత్తూ కోలుకోలేక జూన్‌ 29న తుదిశ్వాస విడిచారు. కాగా మంగళవారం(జూలై 12) మీనా పెళ్లి రోజు. 2009 జులై 12న విద్యాసాగర్‌తో కలిసి ఆమె పెళ్లిపీటలెక్కింది. వీరికి నైనిక అనే కూతురు ఉంది. తన పెళ్లిరోజు సందర్భంగా భర్తను తలచుకుంటూ భావోద్వేగానికి గురైంది మీనా.

మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి..

ఇవి కూడా చదవండి

సోషల్‌ మీడియాలో తన భర్త ఫొటోను షేర్‌ చేస్తూ ‘ మీరు దేవుడు ఇచ్చిన ఓ అద్భుతమైన బహుమతివి. కానీ ఆ దేవుడు చాలా త్వరగా మిమ్మల్ని నా నుంచి దూరంగా తీసుకువెళ్లిపోయాడు. మీరు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటారు. ఇలాంటి కఠిన సమయంలో మా పట్ల ప్రేమ, అప్యాయత చూపించిన ప్రపంచంలోని ప్రతి మంచి మనసుకు నేను, నా కుటుంబం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి పరిస్థితిలో మాకు అండగా ఉన్న బంధువులు, స్నేహితులకు మేం రుణపడి ఉంటాం. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పటికీ అవసరమే’ అంటూ ఎమోషనల్‌ నోట్‌ పెట్టింది మీనా. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. అభిమానులు ఆమెకు మనోధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..