Robin Uthappa: రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందిన సీఎస్కే స్టార్‌ ప్లేయర్‌.. మాకు దక్కిన గొప్ప వరమంటూ ఎమోషనల్‌..

Robin Uthappa: ఎలాంటి బౌలరైనా భయం లేకుండా క్రీజు మధ్యలోకి వచ్చి భారీ షాట్లు ఆడే రాబిన్‌ ఊతప్ప గురించి క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2006లో భారత్‌ తరఫున అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన అతను..

Robin Uthappa: రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందిన సీఎస్కే స్టార్‌ ప్లేయర్‌.. మాకు దక్కిన గొప్ప వరమంటూ ఎమోషనల్‌..
Robin Uthappa
Follow us
Basha Shek

|

Updated on: Jul 14, 2022 | 5:55 PM

Robin Uthappa: ఎలాంటి బౌలరైనా భయం లేకుండా క్రీజు మధ్యలోకి వచ్చి భారీ షాట్లు ఆడే రాబిన్‌ ఊతప్ప గురించి క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2006లో భారత్‌ తరఫున అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన అతను ఆ మరుసటి ఏడాది పొట్టి ఫార్మాట్‌లోనూ అరంగేట్రం చేశాడు. ఇక 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌లో అతని బ్యాటింగ్‌ విన్యాసాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే ఆరంభంలో చూపించిన దూకుడును అలాగే కొనసాగించలేకపోయాడు. జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత ఐపీఎల్‌లో మెరుగ్గానే రాణించాడు. ఇదిలా ఉంటే ఈ టీమిండియా సీనియర్‌ ఆటగాడు రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతని సతీమణి శీతల్‌ తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నాడు ఊతప్ప. భార్యా, బిడ్డలతో ఉన్న ఫొటోను పంచుకుంటూ తన గారాల పట్టిని ప్రపంచానికి పరిచయం చేశాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ROBIN UTHAPPA (@robinaiyudauthappa)

 పేరెంట్స్‌గా ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌..

ఊతప్ప 2016లో శీతల్‌తో కలిసి పెళ్లిపీటలెక్కారు. వీరికి ఇప్పటికే నీల్‌ నోలన్‌ ఊతప్ప అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా కుమార్తె వీరి కుటుంబంలోకి అడుగుపెట్టింది. ‘మా జీవితాల్లో అడుగుపెట్టిన చిన్నారి దేవతను మీకు పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ట్రినిటి థియా ఊతప్ప.. మమ్మల్ని నీ పేరెంట్స్‌గా ఎంచుకున్నందుకు.. నిన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చే అవకాశం ఇచ్చినందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. నీకు తల్లిదండ్రులమైనందుకు మేము.. అన్నయ్య అయినందుకు నీ సోదరుడు.. దీనిని మాకు దక్కిన గొప్ప వరంగా భావిస్తున్నాం’ అని ఈ సందర్భంగా ఎమోషనల్‌ నోట్‌ రాసుకొచ్చాడు ఊతప్ప. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. చెన్నై సూపర్‌ కింగ్స్ యాజమాన్యంతో పాటు పలువురు క్రికెటర్లు ఊతప్ప దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..