Telugu News Entertainment IMDb Releases Top 10 Indian Films And Web Series Of 2022 Kamal Haasan Vikram, Campus Diaries Top The Chart
ఈ ఏడాది అదరగొట్టిన టాప్ 10 సినిమాలు, వెబ్‌సిరీస్‌లివే.. ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఫిల్మ్స్ లిస్టులో ఏమేం ఉన్నాయంటే..
IMDb 2022 Most Popular Films: ఈ ఏడాది ప్రారంభంలో కరోనా మూడో వేవ్ వల్ల సినిమా పరిశ్రమ మళ్లీ సంక్షోభంలో పడినట్లైంది. వైరస్ భయంతో ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారా?లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే కంటెంట్ బాగుంటే..
IMDb 2022 Most Popular Films: ఈ ఏడాది ప్రారంభంలో కరోనా మూడో వేవ్ వల్ల సినిమా పరిశ్రమ మళ్లీ సంక్షోభంలో పడినట్లైంది. వైరస్ భయంతో ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారా?లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను సైతం ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. ఈక్రమంలోనే ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్2, భీమ్లానాయక్, విక్రమ్ లాంటి చిత్రాలు సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచాయి. కేవలం దక్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ వసూళ్ల వర్షం కురిపించాయి. ఈక్రమంలో ఐఎండీబీ(ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) ఈ ఏడాది టాప్ టెన్ మూవీస్ అండ్ వెబ్‌సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. ఇందులో 8.8 రేటింగ్‌తో కమల్ హాసన్ విక్రమ్ మొదటి స్థానంలో నిలిచింది. మరి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న టాప్-10 సినిమాలు, సిరీస్‌లేంటో ఒకసారి చూద్దాం రండి.