Virat Kohli: మెగాస్టార్ చిరుకు కోహ్లీకి విడదీయరాని సంబంధం ఉంది? అదేంటో తెలుసా?..
మెగాస్టార్ చిరంజీవి..! టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో. ఖైదీ సినిమా కాలం నుంచి నేటి వరకు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను బద్దుల కొడుతున్న హీరో.! తన సినిమాలతో రికార్డులతో..
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి తెలియని వారు అసలే లేరు. అటు సినిమాలోనూ.. ఇటు క్రికెట్ లోనూ.. డెమీ గార్డ్స్ గా పేరు తెచ్చుకున్న.. ఈ ఇద్దరు లెజెండ్స్‌కి మధ్యలో ఓ రిలేషన్ ఉందని మీకు తెలుసా..? ఆ రిలేషన్ ఇప్పటిది కాదని మీకు తెలుసా..? అసలు ఆ రిలేషన్ ఏంటనేది తెలుసుకోవాలంటే రీడ్ దిస్ స్టోరీ..!
మెగాస్టార్ చిరంజీవి..! టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో. ఖైదీ సినిమా కాలం నుంచి నేటి వరకు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను బద్దుల కొడుతున్న హీరో.! తన సినిమాలతో రికార్డులతో.. బాక్సాఫీస్ కలెక్షన్లతో.. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీనే నార్త్‌లో రిప్రజెంట్ చేసే వరకు వెళ్లిన హీరో.! బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బీనే.. ఒకానొక టైంలో వెనక్కి నెట్టిన హీరో..! అయితే ఈ హీరో యాక్టింగ్‌కి.. ఎస్పెషల్లీ డ్యాన్సింగ్‌కి ఎప్పుడో ఫిదా అయిపోయి హార్డ్ కోర్ అభిమానిగా మారిపోయారు కోహ్లీ. ఇదే విషయాన్ని అండర్ 15 టైంలో తన సహచర క్రికెటర్ రవితేజ ద్వారా అప్పట్లో తెలిసేలా చేశారు కూడా..!
అయితే ఇదే విషయాన్ని మరో సారి నెట్టింట వైరల్ అయ్యేలా చేశారు క్రికెటర్ రవితేజ. దాదాపు 6 సంవత్సరాల తరువాత.. కలిసిన రవితేజను చూసి.. కోహ్లి ‘చిరు ఎలా ఉన్నావ్?’ అని అడిగారట. ఇక ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన రవితేజ… తాము చిరు అనే ఒకరినొకరం పిలుచుకుంటామని.. ఎందుకంటే.. అండర్ 15 టైలో ఆస్ట్రేలియా లోని ఓ హోటల్ రూమ్‌లో తాము కలిసి ఉన్నప్పుడు.. చిరు పాటలకు కోహ్లి డ్యాన్స్ చేసేవారని మరో సారి తన ట్వీట్‌లో కోట్ చేశారు రవితేజ.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.