AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram Chiyaan: ఒకే హీరో.. ఐదు భాషల్లో డబ్బింగ్.. గర్జిస్తున్న విక్రమ్.. వీడియో అదుర్స్ అంతే..

అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీలో విక్రమ్ తోపాటు.. కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్స్‏కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Vikram Chiyaan: ఒకే హీరో.. ఐదు భాషల్లో డబ్బింగ్.. గర్జిస్తున్న విక్రమ్.. వీడియో అదుర్స్ అంతే..
Vikram Chiyaan
Rajitha Chanti
|

Updated on: Jul 14, 2022 | 12:41 PM

Share

తమిళ్ స్టార్ విక్రమ్ చియాన్‏కు (Vikram) తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అపరిచితుడు, మల్లన్న, ఐ, విలన్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం విక్రమ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తోన్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీలో విక్రమ్ తోపాటు.. కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్స్‏కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవలే విడుదలైన టీజర్ పొన్నియన్ సెల్వన్ మూవీపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విక్రమ్ తన మాట నిలబెట్టుకుంటూ పొన్నియన్ సెల్వన్ విడుదలయ్యే మొత్తం ఐదు భాషలకు తానే స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారట. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. విక్రమ్ డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారంటూ ఆయనకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు. అందులో విక్రమ్ ఎంతో పవర్‏ఫుల్ గా డైలాగ్ చెబుతూ అందుకు తగిన సీరియస్ హావాభావాలను చూపిస్తు కనిపించాడు. విక్రమ్ పవర్ ఫుల్ వీడియో చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇటీవల టీజర్ లాంచ్ వేడుకలకు అనారోగ్య సమస్యలతో విక్రమ్ దూరమయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విక్రమ్ డబ్బింగ్ చెప్పే వీడియో మేకర్స్ షేర్ చేయడం అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ నిర్మాణ విలుువలతో, హై టెక్నికల్ వేల్యూస్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోంది. అందులో మొద‌టి భాగం ‘పొన్నియిన్ సెల్వ‌న్ 1’ ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర
గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర
రెండే రెండు చాలు.. అన్నం తిన్నార వీటిని తింటే ఏం జరుగుతుందో..
రెండే రెండు చాలు.. అన్నం తిన్నార వీటిని తింటే ఏం జరుగుతుందో..
టీమిండియాలో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు
టీమిండియాలో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు
ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ రత్నం ఓ వరం!.. ఏ వేలికి ధరించాలంటే..
ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ రత్నం ఓ వరం!.. ఏ వేలికి ధరించాలంటే..
నవపంచమి యోగం! పెళ్లి, సంపద, కెరీర్‌లో జాక్‌పాట్ కొట్టే రాశులు ఇవే
నవపంచమి యోగం! పెళ్లి, సంపద, కెరీర్‌లో జాక్‌పాట్ కొట్టే రాశులు ఇవే
ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక ఇక్కట్లు
ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక ఇక్కట్లు
ఆధార్, పాన్ వాడుతున్నారా..? కేంద్రం నుంచి పెద్ద ఊరట
ఆధార్, పాన్ వాడుతున్నారా..? కేంద్రం నుంచి పెద్ద ఊరట
15 ఏళ్ల వయసు.. 15 భారీ లక్ష్యాలు.. ఈ ఐపీఎల్లో వైభవ్ సాధిస్తాడా ?
15 ఏళ్ల వయసు.. 15 భారీ లక్ష్యాలు.. ఈ ఐపీఎల్లో వైభవ్ సాధిస్తాడా ?
ఏం సిరీస్ మావ.. యూట్యూబ్‏లో రచ్చ చేస్తున్న హారర్ థ్రిల్లర్..
ఏం సిరీస్ మావ.. యూట్యూబ్‏లో రచ్చ చేస్తున్న హారర్ థ్రిల్లర్..
ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు
ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు