Krithi Shetty: హీరో సూర్య పై కృతి శెట్టి సెన్సెషనల్ కామెంట్స్.. అతనితో కలిసి పనిచేయడం గురించి ఏం చేప్పిందంటే..

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా సూర్యతో కలిసి పనిచేయడం పై కృతి శెట్టి మనసులోని మాటలను పంచుకుంది.

Krithi Shetty: హీరో సూర్య పై కృతి శెట్టి సెన్సెషనల్ కామెంట్స్.. అతనితో కలిసి పనిచేయడం గురించి ఏం చేప్పిందంటే..
Krithi Shetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 14, 2022 | 11:06 AM

ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty). ప్రస్తుతం ఈ అమ్మడు ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ది వారియర్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఇది కాకుండా కృతి శెట్టి తమిళ్ స్టార్ సూర్య.. డైరెక్టర్ బాలా కాంబోలో రాబోతున్న సినిమాలోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా సూర్యతో కలిసి పనిచేయడం పై కృతి శెట్టి మనసులోని మాటలను పంచుకుంది.

” సూర్య సర్, బాలా సర్‏తో కలిసి పనిచేయడం గురించి నేను ఊహించలేదు. బాల సర్ తో పనిచేయడం నాకు అర్థమైంది. అతను చాలా పర్ఫెక్షనిస్ట్. షూటింగ్ మొదటి రోజు బాల సర్ నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చాడు. అలాగే సూర్య సర్ గురించి చాలా విన్నాను. కానీ అతనిని కలిసిన తర్వాత పని పట్ల ఎంత నిబద్ధతతో ఉంటాడనే విషయాన్ని గ్రహించాను. ప్రజలతో వ్యవహరించే విధానం, ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటారు. సూర్య సర్ మాదిరిగా ఉండడానికి చాలా స్పూర్తినిస్తుంది.” అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే రామ్ పోతినేని చాలా ప్రశాంతంగా ఉంటారని. సెట్స్ లో అతనితో సరదాగా ఉండేందుకు ఎక్కువ సమయం పట్టలేదని.. అతనితో పనిచేయడం అద్భుతంగా ఉందని తెలిపింది.