Godse Movie: డిజిటల్‌ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైన గాడ్సే.. ఏ ఓటీటీలో, ఎప్పుడు రానుందంటే..

Godse Movie: విభిన్న కథాంశాలతో, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు సత్యదేవ్‌. సత్యదేవ్‌ నటించడాంటే సినిమాలో కచ్చితంగా...

Godse Movie: డిజిటల్‌ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైన గాడ్సే.. ఏ ఓటీటీలో, ఎప్పుడు రానుందంటే..
Follow us

|

Updated on: Jul 14, 2022 | 11:15 AM

Godse Movie: విభిన్న కథాంశాలతో, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు సత్యదేవ్‌. సత్యదేవ్‌ నటించడాంటే సినిమాలో కచ్చితంగా మ్యాటర్‌ ఉంటుందనుకునే సినీ లవర్స్‌ ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ యంగ్‌ హీరో తాజాగా నటించిన చిత్రం గాడ్సే. జూన్‌ 17న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. సమకాలీన రాజకీయాలపై అస్త్రంగా విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. థియేటర్లలో మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది.

థియేటర్లలో విడుదలైన సరిగ్గా నెల రోజులకు సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా జూలై 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ ప్రారంభం కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సి. కళ్యాణ్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు గోపి గణేష్‌ దర్శకత్వం వహించాడు. ఇక ఇందులో సత్యదేవ్‌ సరసన మలయాళ నటీమణి ఐశ్వర్య నటించింది. నాగబాబు చాలా రోజుల తర్వాత ఇందులో కీలక పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే సత్యదేవ్‌ ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఉల్లి తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా.? నిపుణులేమంటున్నారు.?
ఉల్లి తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా.? నిపుణులేమంటున్నారు.?
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!
తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!