AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movies: సినీ లవర్స్‌కు ఈ వీకెండ్‌ పండగే.. థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతోన్న సినిమాలివే..

Movies: శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ లవర్స్‌ కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు. మొన్నటి వరకు వారంతం అంటే కేవలం థియేటర్లలో సినిమాల కోసం ఎదురు చూసే వారు కానీ ప్రస్తుతం ఈ స్థానంలోకి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు...

Movies: సినీ లవర్స్‌కు ఈ వీకెండ్‌ పండగే.. థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతోన్న సినిమాలివే..
Narender Vaitla
|

Updated on: Jul 14, 2022 | 7:49 AM

Share

Movies: శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ లవర్స్‌ కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు. మొన్నటి వరకు వారంతం అంటే కేవలం థియేటర్లలో సినిమాల కోసం ఎదురు చూసే వారు కానీ ప్రస్తుతం ఈ స్థానంలోకి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా వచ్చి చేరాయి. దీంతో అటు థియేటర్లు ఇటు ఓటీటీల్లో సినిమాలు చూస్తూ వారంతాన్ని తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. మరి ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఏంటి.? ఏ తేదీల్లో విడుదల కానున్నాయో ఓ లుక్కేయండి..

థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలివే..

ది వారియర్‌..

సినీ లవర్స్‌ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం వారియర్‌, రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్‌కు జోడిగా కృతిశెట్టి నటిస్తోంది. ఈ సినిమా జులై 14 (నేడు) థియేటర్లలో విడుదల కానుంది.

గార్గి..

సాయిపల్లవి నటనకు ప్రాధాన్యత ఉన్న మరో పాత్రలో నటిస్తోన్న చిత్రం గార్గి. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా థియేటర్లలో జులై15న విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

అమ్మాయి: డ్రాగన్‌ గర్ల్

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 15న థియేటర్లలో విడుదలకానుంది. మార్షల్‌ ఆర్ట్స్‌, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఓటీటీలో వస్తోన్న సినిమాలివే..

* మామానితన్‌ – జూలై 15 (ఆహా)

* మా నీళ్ల ట్యాంక్‌ – జూలై 15 (జీ5)

* జన్‌హిత్‌ మే జారీ – జూలై 15 (జీ5)

* జాదుఘర్‌ – జూలై 15 (నెట్‌ఫ్లిక్స్‌)

* షూర్‌వీర్‌ – జూలై 15 (హాట్‌స్టార్‌)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే
మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి.. మహాన్ ఆర్యమన్ సింధియా..
మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి.. మహాన్ ఆర్యమన్ సింధియా..
కుజ గ్రహం అనుగ్రహం.. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగే ఉండదు..!
కుజ గ్రహం అనుగ్రహం.. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగే ఉండదు..!
హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలినీ.. షాకింగ్ ట్విస్ట్..
హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలినీ.. షాకింగ్ ట్విస్ట్..
ఇన్నాళ్లు ఇది ఎలా మిస్సయ్యావ్.. అసలైన సీక్రెట్ పట్టేశావ్‌గా
ఇన్నాళ్లు ఇది ఎలా మిస్సయ్యావ్.. అసలైన సీక్రెట్ పట్టేశావ్‌గా
ప్రధాని మోదీ పుట్టినరోజు.. ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేక పూజలు..
ప్రధాని మోదీ పుట్టినరోజు.. ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేక పూజలు..
కల్తీ పన్నీరు కలకలం..అధికారుల తనిఖీలు,మద్రాస్ ల్యాబ్‌కు శాంపిల్స్
కల్తీ పన్నీరు కలకలం..అధికారుల తనిఖీలు,మద్రాస్ ల్యాబ్‌కు శాంపిల్స్
డైరెక్టర్ శ్రీను వైట్ల కూతురిని చూశారా.. ?
డైరెక్టర్ శ్రీను వైట్ల కూతురిని చూశారా.. ?
విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి..
విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి..