Bimbisara: కళ్యాణ్ రామ్ సినిమా కోసం రంగంలోకి నటసింహం, యంగ్ టైగర్

నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఇటీవల కళ్యాణ్ రామ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు

Bimbisara: కళ్యాణ్ రామ్ సినిమా కోసం రంగంలోకి నటసింహం, యంగ్ టైగర్
Ntr, Balakrishna,kalyanram
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 14, 2022 | 7:10 AM

నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఇటీవల కళ్యాణ్ రామ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా ఆయన బింబిసార(Bimbisara)అనే హిస్టారికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. రీసెంట్ ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేశారు చిత్రయూనిట్. బింబిసార చిత్రాన్ని ఆగ‌స్ట్ 5న విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి విడుద‌లైన క‌ళ్యాణ్ రామ్ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చింది.

త్వరలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటసింహం నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారని అంటున్నారు. బాలయ్య- తారక్ ఒకే వేదిక పై సందడి చేయనున్నారని ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మొన్నమధ్య బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలయ్య , తారక్ కలిసి కనిపించి అభిమానులను అలరించారు. ఇప్పుడు మరోసారి బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్ లో తారక్- బాలయ్య కలిసి సందడి చేయనున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. చిరంతన్ భట్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?