AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth’s Jailer:హైదరాబాద్‌లోనే సూపర్ స్టార్ సినిమా షూటింగ్.. షురూ అయ్యేది అప్పటినుంచే

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే అన్నత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

Rajinikanth's Jailer:హైదరాబాద్‌లోనే సూపర్ స్టార్ సినిమా షూటింగ్.. షురూ అయ్యేది అప్పటినుంచే
Rajinikanth
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2022 | 6:35 AM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఇటీవలే అన్నత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో రజిని నెక్స్ట్ సినిమాకోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తన్నారు ఆయన ఫ్యాన్. సూపర్ స్టార్ కెరీర్ లో 169 సినిమా ఈ మూవీ రానుంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్  ఇటీవలే దళపతి విజయ్ తో బీస్ట్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బీస్ట్ మూవీ అభిమానులను నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాతో ఎలాగైన హిట్టు కొట్టాలని కసిమీదున్నాడు నెల్సన్. ఈ సినిమాను జైలర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమాషూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ ను వెచ్చే నెలనుంచి జరపాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించనున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం కొన్ని భారీ సెట్స్ వేయిస్తున్నారట. మేజర్ పార్టు షూటింగు ఇక్కడే జరగనుందని అంటున్నారు. ఈ సినిమా సన్ పిచర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనుంది. ఈ సినిమా ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటిస్తున్నారని టాక్ ప్రచారంలో ఉంది. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర నరసింహ సినిమాలో తరహాలో ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మరో కీలక  పాత్ర కోసం ప్రియాంక అరుళ్ మోహన్ నటించనుందట.. ఈ మూవీకి కేఎస్ రవికుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చడం మరో విశేషం. ఇక యంగ్ మ్యుజిషియన్ అనిరుద్ పవర్ఫుల్ మ్యూజిక్ అందించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఫోన్ స్క్రీన్ కాదది.. మెదడును మెల్లగా తినేసే డిజిటల్ డ్రగ్!
ఫోన్ స్క్రీన్ కాదది.. మెదడును మెల్లగా తినేసే డిజిటల్ డ్రగ్!
తులసి మొక్క ఎందుకు ఎండిపోతుంది..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
తులసి మొక్క ఎందుకు ఎండిపోతుంది..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
ఏపీలో భానుడి భగభగ.. 41 మండలాలకు వడగాలుల హెచ్చరిక..
ఏపీలో భానుడి భగభగ.. 41 మండలాలకు వడగాలుల హెచ్చరిక..
పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!
పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!
ఏటీఎం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రాపై బిగ్ అప్డేట్..
ఏటీఎం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రాపై బిగ్ అప్డేట్..
మిగిలిపోయిన రైస్ పారేయకండి.. ఇలా పుదీనా రైసే చేస్తే ప్లేటు ఖాళీ
మిగిలిపోయిన రైస్ పారేయకండి.. ఇలా పుదీనా రైసే చేస్తే ప్లేటు ఖాళీ
పుచ్చకాయలోని ఈ పార్ట్ తింటే జెట్ స్పీడ్ తో బరువు తగ్గుతారట!
పుచ్చకాయలోని ఈ పార్ట్ తింటే జెట్ స్పీడ్ తో బరువు తగ్గుతారట!
ఒక్కసారి చూసారంటే వెళ్లాలని అనిపించే దక్షిణాది టాప్ నేచర్..
ఒక్కసారి చూసారంటే వెళ్లాలని అనిపించే దక్షిణాది టాప్ నేచర్..
తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఆ రోజే జెండా ఆవిష్కరించనున్న కవిత..
తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఆ రోజే జెండా ఆవిష్కరించనున్న కవిత..
బంగారం, వెండితో పాటు పెరుగుతున్న ఈ లోహం ధరలు
బంగారం, వెండితో పాటు పెరుగుతున్న ఈ లోహం ధరలు