Kiran Abbavaram: సక్సెస్ కోసం ఎదురుచుస్తోన్న యంగ్ హీరో.. ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో రానున్న కిరణ్ అబ్బవరం

టాలెంట్ ఉంటే చాలు సినిమా ఇండస్ట్రీలో రాణించవచ్చు.. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. షార్ట్ ఫిలిం చేస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్.

Kiran Abbavaram: సక్సెస్ కోసం ఎదురుచుస్తోన్న యంగ్ హీరో.. 'వినరో భాగ్యము విష్ణుకథ'తో రానున్న కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram .
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 14, 2022 | 6:15 AM

టాలెంట్ ఉంటే చాలు సినిమా ఇండస్ట్రీలో రాణించవచ్చు.. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). షార్ట్ ఫిలిం చేస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్. హిట్లు  తొలి సినిమా రాజావారు రాణిగారు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ కుర్ర హీరో. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం, సెబాస్టియన్ రీసెంట్ గా సమ్మతమే సినిమాలతో అలరించిన ఈ యంగ్ హీరో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ సినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటిస్తోంది. నూతన దర్శకుడు మురళీ కిశోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు కిరణ్ అబ్బవరం.

తాజాగా ఈ సినిమానుంచి గ్లిమ్ప్స్ రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ మూవీ నుంచి గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేయనున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇటీవల వరుసగా పరాజయాలు పలకరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పెద్ద బ్యానర్ లో సినిమా చేసి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు నేను మీకా బాగా కావాల్సిన వాడిని అనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ రెండు సినిమాలు కిరణ్ కు ఎలాంటి హిట్స్ అందిస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి