Allu Arjun: వేణు శ్రీరామ్- అల్లు అర్జున్ ఐకాన్ సినిమా అటకెక్కినట్టేనా..?
వకీల్ సాబ్ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాను వకీల్ సాబ్ గా రీమేక్ చేశారు వేణు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ గా..
వకీల్ సాబ్ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్(Venu Sriram). బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాను వకీల్ సాబ్ గా రీమేక్ చేశారు వేణు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు వేణుకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వేణు శ్రీరామ్ తన నెస్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయకపోయినప్పటికీ అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో సినిమా చేస్తున్నాడన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఏ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వేణు శ్రీరామ్ గతంలో అల్లు అర్జున్ తో ఓ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా కంటే ముందే ఈ సినిమాను అనౌన్స్ చేశారు వేణు. ఈ సినిమాకు ఐకాన్ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు.
కానీ ఇంతలో బన్నీ సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమాను పట్టాలెక్కించాడు. అదే సమయంలో వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అయితే సుకుమార్ పుష్ప సినిమాను రెండు భాగాలు గా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. పుష్ప 1 పూర్తయిన తర్వాత గ్యాప్ లో ఐకాన్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ బన్నీ వెంటనే పుష్ప 2 ను పట్టాలెక్కించాడు. పుష్ప 2 తర్వాత కూడా త్రివిక్రమ్, బోయపాటి సినిమాలు చేస్తున్నాడు బన్నీ. అటు వేణు కూడా అఖిల్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. దాంతో ఐకాన్ సినిమా అటకెక్కినట్టే అని వార్తలు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.