సినిమాలు మానేసి వ్యవసాయం చేసుకుంటా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినిమాల్లో రాణించడం అంత ఈజీ కాదు.. సక్సెస్ కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది రాణిస్తుంటే మరికొంతమంది మాత్రం హిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది అవకాశాలు తగ్గితే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతుంటారు. కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటారు.

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో రాణించాలని ఎంతో మంది ఎంట్రీ ఇస్తుంటారు. అయితే అందరూ సక్సెస్ అవ్వలేరు. కొందరు సక్సెస్ అయినప్పటికీ దాన్ని కంటిన్యూ చేయలేరు. కొన్ని సినిమాలకే పరిమితం అవుతుంటారు. మరికొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారి సినిమాలు చేస్తుంటారు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇక సినిమా అవకాశాలు తగ్గితే కొంతమంది హీరోయిన్స్ పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారు. మరికొంతమంది బిజినెస్ లల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. అయితే ఓ హీరోయిన్ సినిమాల్లో క్రేజ్ వచ్చింది కాబట్టే కంటిన్యూ చేస్తున్నా లేదంటే వెళ్లి వ్యవసాయం చేసుకునే దాన్ని అని చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
బాలీవుడ్ లో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో వారిలో యామీ గౌతమ్ ఒకరు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న యామీ గౌతమ్ తెలుగులోనూ చాలా సినిమాలు చేసింది. నువ్విలా, కొరియర్ బాయ్ కల్యాణ్, గౌరవం, యుద్ధం సినిమాల్లో కథానాయికగా చేసింది. అయితే 2015లో రిలీజైన కొరియర్ బాయ్ కల్యాణ్ తర్వాత కేవలం బాలీవుడ్ కే పరిమితమైందీ అందాల తార. దర్శకుడు ఆదిత్య ధర్ ను పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆదిత్య ధర్ ఇటీవల దురంధర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో యామీ గౌతమ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు అవార్డులు , సక్సెస్‌లకంటే ప్రేక్షకుల ప్రేమే ముఖ్యం అని తెలిపింది. అలాగే కొన్ని సినిమాలు తన స్థాయిని పెంచాయని అందుకే సినిమాల్లో కంటిన్యూ అవుతున్నా అని తెలిపింది.. ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో హిమాలయాలకు వెళ్లి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నా అని చెప్పుకొచ్చింది. అయితే బాలా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో వరుసగా అవకాశాలు వచ్చినట్లు ఆమె తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
