Maa Neela Tank: ‘నేను చాలా ఓపెనప్ అవ్వాల్సి వచ్చింది’.. సుశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సుశాంత్ ఒకరు. ఈ కుర్ర హీరో కరెంట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించాడు సుశాంత్.
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సుశాంత్(Sushanth)ఒకరు. ఈ కుర్ర హీరో కరెంట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించాడు సుశాంత్. ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసినప్పటికీ భారీ హిట్ ను మాత్రం అందుకోలేక పోయాడు. దాంతో సెకండ్ హీరో అవతారమెత్తాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోగా కనిపించి మెప్పించాడు సుశాంత్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ సుశాంత్ కు బ్రేక్ రాలేదు. ఇక ఇప్పుడు మాస్ రాజా రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. మా నీళ్ల ట్యాంక్(Maa Neela Tank) అనే ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సుశాంత్ మాట్లాడుతూ..
నేను చాలా వెబ్ సిరీస్ కథలు విన్నాను కానీ అవేవి నచ్చక ఓకే చెయ్యలేదు అన్నారు. నాకు లక్ష్మి సౌజన్య గారు 8 ఎపిసోడ్స్ ల స్క్రిప్ట్ చదవమని ఇచ్చారు. నాకది కనెక్ట్ అవ్వడంతో ఆ స్క్రిప్ట్ ఓటిటి కా,సినిమా కా, వెబ్ సిరీస్ కా అని అని చూడకుండా స్క్రిప్ట్ నచ్చడంతో మా నీళ్ల ట్యాంక్ చేయడం జరిగింది.ఈ సిరీస్ షూట్ లొకి వచ్చినప్పుడు సినిమా కంటే వెబ్ సిరీస్ లలో ఎక్కువ మంది నటిస్తున్నారు అనిపించింది.నిర్మాత ప్రవీణ్ కొల్ల గారు చీరాల దగ్గర నాగులపాలెం లో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. దర్శకురాలు లక్ష్మి సౌజన్య గారు ప్రతి క్యారెక్టర్ ను చాలా కేర్ తీసుకొని చాలా చక్కగా తెరకెక్కించారు. ఇందులో నటించిన వారందరూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా చక్కగా నటించాము.ఈ వెబ్ సిరీస్ ను చూస్తుంటే ఇందులోని ప్రతి క్యారెక్టర్స్ మీకు గుర్తుండి పోతుంది. ఎంటర్టైన్మెంట్ మాత్రం గోపాల్ గా నటించిన సుదర్శన్ ఎక్కువిస్తాడు. ఈ సిరీస్ నాకు మోస్ట్ ఎంజాయ్ బుల్ ప్రాజెక్టు. ఎందుకంటే ఇందులో నేను చాలా ఓపెనప్ అవ్వాల్సి వచ్చింది.ఇందులో నేను చాలా వెటకారంగా, సరదాగా ఉండే వంశీ క్యారెక్టర్ లో చాలాఎంజాయ్ చేస్తూ నటించాను.
నా చిత్రాలు చి. ల. సౌ, అలవైకుంఠపురం, నో పార్కింగ్ తరువాత నేను మొదటి సారి రూరల్ బ్యాక్ డ్రాప్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాను. ఇప్పటి వరకు ఇలాంటి ఓపెనప్ క్యారెక్టర్ చేయలేదు. నేను ప్రౌడ్ గా చెప్పగలను ఇప్పటి వరకు నేను చేసిన ఫిలిమోగ్రఫీ లో “మా నీళ్ల ట్యాంక్” ఉంటుందని గర్వంగా చెప్పగలను. ఇప్పుడున్న ఆడియన్స్ స్ట్రెస్ కు, కురుస్తున్న వర్షాలకు అందరూ ఇళ్లలోనే వుంటున్నారు. కాబట్టి ఆడియన్స్ అందరూ హ్యాపీ గా ఇంట్లో కూర్చొని “మా నీళ్ల ట్యాంక్” వెబ్ సిరీస్ చూడండి చూస్తూనే ఉండి పోతారు అని అన్నారు సుశాంత్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.