Ram Gopal Varma: వర్మ ‘అమ్మాయి’ తెలుగు వారందరికీ గర్వకారణం.. ఆర్జీవీపై పొగడ్తలు కురిపించిన విజయేంద్ర ప్రసాద్..
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం 'అమ్మాయి'. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా భాలేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నేడు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా...
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘అమ్మాయి’. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా భాలేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నేడు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను ఏకంగా చైనాలో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కీరవాణితో పాటు రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పది నెలల క్రితం ‘కనబడుటలేదు’ చిత్ర పాటల వేడుకకు వెళ్లా. దానికి వర్మ కూడా వచ్చారు. పదిహేనేళ్లుగా నాలో గూడు కట్టుకున్న కోపం, చిరాకు, అసహ్యం, బాధ అన్నీ కలగలిపి ఆరోజు స్టేజీపై ఆయనను కొన్ని మాటలన్నాను. ‘శివ’ సినిమాతో నాతోపాటు ఎంతో మంది రచయితలు, టెక్నీషియన్లు, దర్శకులు ఆర్జీవీ నుంచి స్ఫూర్తి పొంది ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ, ఆనాటి వర్మ కనిపించడం లేదు. మీకేమైనా కనిపిస్తే మళ్లీ అలాంటి చిత్రం తీయమని చెప్పండి’ అన్నాను. ఇప్పుడు ‘అమ్మాయి’ చూశాక గర్వంగా చెబుతున్నా. రాములోని ఆనాటి డైరెక్టర్ మళ్లీ కనిపించార’ని చెప్పుకొచ్చారు.
అమ్మాయి సినిమాతో వర్మ ‘శివ’ కంటే వందింతలు ఎక్కువ కనిపించారన్నారు. ఇక ఈ సినిమా 40 వేల థియేటర్లలో విడుదలవుతుండడం నిజంగా అద్భుతమన్న విజయేంద్ర ప్రసాద్.. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమని వర్మపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా గురించి రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ..’ఈ సినిమాను నేను ఎంతో ఎమోషనల్ అయ్యి తీశాను. 40 ఏళ్లు అయినా మనం బ్రూస్లీ ఫైట్స్ ఎందుకు మరచిపోలేకపోతున్నాము అని పరిశోధన చేసిన తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కించాను’ అని చెప్పుకొచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..