AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: నాగార్జున 100వ సినిమాపై జోరుగా చర్చ.. అసలేంటి ముచ్చట..?

ఈ రోజుల్లో 25వ సినిమా చేస్తుంటేనే చాలా హంగామా చేస్తుంటారు హీరోలు. ఆ నెంబర్ ఎంతెంత పెరుగుతుంటే.. రచ్చ కూడా అంతంతే పెరుగుతుంటుంది. ఇక మ్యాజికల్ నెంబర్ 100 కు చేరువైందంటే.. ఆ నటుడు ఓ శిఖరం చేరుకున్నట్లే.

Nagarjuna: నాగార్జున 100వ సినిమాపై జోరుగా చర్చ.. అసలేంటి ముచ్చట..?
Nagarjuna
Rajeev Rayala
|

Updated on: Jul 15, 2022 | 6:09 AM

Share

ఈ రోజుల్లో 25వ సినిమా చేస్తుంటేనే చాలా హంగామా చేస్తుంటారు హీరోలు. ఆ నెంబర్ ఎంతెంత పెరుగుతుంటే.. రచ్చ కూడా అంతంతే పెరుగుతుంటుంది. ఇక మ్యాజికల్ నెంబర్ 100 కు చేరువైందంటే.. ఆ నటుడు ఓ శిఖరం చేరుకున్నట్లే. అలాంటి అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు కింగ్ నాగార్జున(Nagarjuna). చాలా సైలెంట్‌గా సెంచరీకి చేరువవుతున్నారు మన్మథుడు. మరి నాగార్జున 100వ సినిమా ఎప్పుడు.. దానికింకా ఎంత దూరంలో ఉన్నారు..?

నాగార్జున 100వ సినిమాకు చేరువవుతున్నారా..? అదేంటి మరి.. ఇంత హంగామా కూడా చేయడం లేదు..? సాధారణంగా అయితే 100వ సినిమా దగ్గరికొస్తుంటే.. నెంబర్ 98 నుంచే రచ్చ మొదలవుతుంది కదా.. మరి నాగ్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అనుకుంటున్నారు కదా..? ఈ విషయంలో నాగ్ ముందు నుంచి ఇదే మెయింటేన్ చేస్తున్నారు. ఈయన 50, 75వ సినిమాకు కూడా హంగామా కనిపించలేదు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న ది ఘోస్ట్ 99వ సినిమా అని తెలుస్తుంది. 1986లో విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నాగార్జున.. మొదటి రెండు మూడేళ్ళు విజయం కోసం చాలా ఇబ్బంది పడ్డారు. నాగేశ్వరరావు కొడుకు అయినా కూడా.. హీరోగా నిలదొక్కుకోడానికి సమయం తప్పలేదు. పైగా ప్రయోగాలు చేయడంలో నాగ్ ముందుండేవారు. ఈ క్రమంలోనే 1989లో ఈయనకు వర్మ కలిసారు.. ఈ ఇద్దరూ కలిసి శివ చేసారు.. ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చేసారు. అదే ఏడాది మణిరత్నంతో గీతాంజలి అంటూ హీరోగా నిలబడిపోయారు నాగార్జున.

90ల్లో ఎన్నో సంచలన సినిమాలు చేసారు నాగార్జున. మిలినియం మొదలైన తర్వాత కూడా నాగ్ తనదైన జోరు చూపించారు. ఇన్నేళ్ల కెరీర్‌లో అన్నమయ్య, మన్మథుడు లాంటి ఎన్నో క్లాసిక్స్ అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ నటించారు. తాజాగా సెంచరీకి చేరువవుతున్నారు ఈయన. అతిథి పాత్రలతో సహా అన్నీ లెక్కేస్తే ప్రస్తుతం ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న ది ఘోస్ట్ నాగార్జునకు 99వ సినిమా అని తెలుస్తుంది. బంగార్రాజు సమయంలోనే 100వ సినిమా టాపిక్ వచ్చినా.. ఆ లెక్కలు తర్వాత చెప్తానన్నారు నాగ్. చిరంజీవి 150.. బాలయ్య 100వ సినిమాల సమయంలో చాలా సందడి కనిపించింది. 100కి ఇంత దగ్గరొచ్చినా.. నాగ్ మాత్రం ఎలాంటి హంగామా చేయట్లేదు. అయితే తన 100వ సినిమా మాత్రం ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు నాగ్. మనం తరహాలోనే కుటుంబం అంతా కలిసి నటించే కథ దొరికితే బాగున్ను అనే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తుంది. కింగ్ 100వ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!