Neetu Chandra: నెలకు పాతిక లక్షలిస్తాను.. భార్యగా ఉండమన్నాడు.. గోదావరి హీరోయిన్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌..

అక్కినేని సుమంత్ హీరోగా శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం గోదావరి. ఇందులో కమలినీ ముఖర్జీ హీరోయిన్‌గా నటించగా.. సుమంత్‌ మరదలి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది బాలీవుడ్‌ హీరోయిన్‌ నీతూ చంద్ర

Neetu Chandra: నెలకు పాతిక లక్షలిస్తాను.. భార్యగా ఉండమన్నాడు.. గోదావరి హీరోయిన్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌..
Neetu Chandra
Follow us
Basha Shek

|

Updated on: Jul 14, 2022 | 9:28 PM

అక్కినేని సుమంత్ హీరోగా శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం గోదావరి. ఇందులో కమలినీ ముఖర్జీ హీరోయిన్‌గా నటించగా.. సుమంత్‌ మరదలి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది బాలీవుడ్‌ హీరోయిన్‌ నీతూ చంద్ర (Neetu Chandra). ఇదొక్కటే కాదు సత్యమేవ జయతే, మనం లాంటి సినిమాల్లోనూ తళుక్కున మెరిసిందీ ముద్దుగుమ్మ. అంతకు ముందు హిందీలో జాన్‌ అబ్రహం, మాధవన్‌ లాంటి స్టార్‌ హీరోలతో కలిసి కొన్ని హిట్‌ సినిమాల్లో నటించింది. ఇలా తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అరకొరగా మాత్రమే సినిమాల్లో కనిపిస్తోంది. కాగా ఇటీవలే ఓ ఇంటర్యూకు హాజరైన ఈ అందాల తార తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నటిగా ఎదిగే క్రమంలో తనకెదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుంది.

గంటసేపు ఆడిషన్స్‌ చేసి చివరకు..

‘నేను 13 మంది జాతీయ అవార్డు గ్రహీతలైన నటుల సరసన హీరోయిన్‌గా పనిచేశాను. పెద్ద సినిమాల్లోనూ నటించాను. అలాంటిది ఇప్పుడు నాకు అవకాశాలు లేవు. ఒక పెద్ద వ్యాపారవేత్త నాకు నెలకు రూ. 25 లక్షలు ఇస్తానని, జీతం తీసుకుని భార్య (శాలరీడ్‌ వైఫ్‌) గా ఉండాలని కోరాడు. నా దగ్గర డబ్బులు లేవని, అవకాశాలు లేవని నా నిస్సహాయత చూసి ఆయన అలాంటి ఆఫర్ ఇచ్చారు. ఆయన అలా మాట్లాడినప్పుడు నా మనసు ఎంతో గాయపడింది. ఇన్ని మంచి సినిమాల్లో నటించాక కూడా నేను ఇక్కడ అనవసరంగా ఉన్నానేమో అని అనిపిస్తుంది. ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నాను. ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ ఆడిషన్స్ కోసం నన్ను పిలిచారు. ఆయన బాగా ఫేమస్. అతని పేరు బయటకి చెప్పాలని అనుకోవడం లేదు. దాదాపు గంట సేపు నన్ను ఆడిషన్స్ చేశాడు. చివరికి రిజెక్ట్ అని చెప్పాడు. వాస్తవానికి కావాలనే అతను గంటసేపు ఆడిషన్ చేసి రిజెక్ట్ చేశాడు’ అంటూ తనకెదురైన చేదు అనుభవాలను గుర్తుతెచ్చుకుని వాపోయింది నీతూ చంద్రం. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..