Telugu News Trending Viral video IPS officer explains how life is more important than likes with terrifying video, Watch
Viral video: లైకుల కన్నా లైఫ్ ఎంతో ముఖ్యం.. షాకింగ్ వీడియోను షేర్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్.. ఇంతకీ అందులో ఏముందంటే..
దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయమైపోతున్నాయి. వాగులు, వంకలు పొర్లిపోతున్నాయి. చాలా చోట్ల సముద్రపు అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. అందుకే సముద్ర తీర ప్రాంతాల వైపు వెళ్లొద్దంటూ అధికారులు..
దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయమైపోతున్నాయి. వాగులు, వంకలు పొర్లిపోతున్నాయి. చాలా చోట్ల సముద్రపు అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. అందుకే సముద్ర తీర ప్రాంతాల వైపు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయితే కొందరు వీటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అత్యుత్సాహంతో వాగులు, వంకలు, నదులు, సముద్రాల వద్ద సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అత్యుత్సాహంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈక్రమంలో దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో జనాలకు ఓ హెచ్చరిక లాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది. ఇది ఒమన్‌లో జరిగిన ఓ విషాదకర సంఘటనకు సంబంధించిన వీడియో.
సలాలహ్ హల్ ముఘుసైల్ బీచ్‌లో అనేకమంది పర్యాటకులు ఫొటోలు, వీడియోలకు ఫోజులిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతలో వారిపైకి ఒక్కసారిగా రాకాసి అలలు దూసుకొస్తాయి. దీంతో కొందరు కళ్లముందే నీటిలో కొట్టుకుపోతారు. మరికొందరిని అక్కడే ఉన్నవారు అప్రమత్తమై కాపాడతారు. ఈ విషాధ ఘటనలో మొత్తం 8మంది భారతీయులు నీటిలో కొట్టుకుపోగా.. మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. మిగతా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రముఖ ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మీ లైక్‌ల కన్నా మీ లైఫ్ ఎంతో ముఖ్యమైంది’ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. మరో ఐపీఎస్ అధికారిణి శిఖా గోయెల్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ‘పశ్చాత్తాపం కన్నా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది.. ప్రస్తుతం కురుస్తోన్న వర్షాల దృష్ట్యా అందరూ జాగ్రత్తగా ఉండాలి’ అంటూ తన పోస్ట్‌లో ఆమె జనాలకు విజ్ఞప్తి చేశారు.
Its better to err on the side of daring than the side of caution ……
A little caution is better than a great regret
Please be cautious especially now, in view of severe rainfall alert pic.twitter.com/Lo6ga6o0t4