Optical Illusion: ఈ ఫేస్‌లో దాగున్న జంతువులు, పక్షులను కనిపెడితే మీరు తోపు.. కేవలం 75 సెకన్లలోపు కనుగొంటే..

Optical Illusion Test: ఇటలీకి చెందిన 16వ శతాబ్దపు  చిత్రకారుడు గియుసేప్ అరిసింబోల్డో కాన్వాస్‌పై చిత్రించాడు. ఈ పెయింటింగ్‌లో ఏనుగు, గుర్రం, నెమలి, ఎలుగుబంటి, పులి, చిరుతపులి, నక్క, కుందేలు, గద్ద, తాబేలు సహా మొత్తం 25 జంతువులు ఉన్నాయి. 

Optical Illusion: ఈ ఫేస్‌లో దాగున్న జంతువులు, పక్షులను కనిపెడితే మీరు తోపు.. కేవలం 75 సెకన్లలోపు కనుగొంటే..
Optical Illusion
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 13, 2022 | 9:49 PM

ఈ రోజుల్లో ఆప్టికల్ ఇల్యూషన్‌కు సంబంధించిన చిత్రాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలు పదునైన కళ్లను పరీక్షించుకోవచ్చు. వాస్తవానికి, అటువంటి చిత్రాలలో చాలా విషయాలు దాగి ఉంటాయి. అవి సులభంగా కనుగొనడం కష్టం. ఈ చిత్రాలలో చిక్కుకున్న రహస్యాన్ని ఛేదించడానికి, కళ్లకు పరీక్షగా మారుతుంది. మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఈ చిత్రంలో దాగివున్న విశేషాలు కనిపిస్తాయి. అలాంటి చిత్రాలను ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటారు.

నువ్వు మేధావివా అయితే..

తాజాగా సోషల్ మీడియాలో మరో ఫొటో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పెయింటింగ్‌లో 25 జంతువులు దాగి ఉన్నాయి. మీరు వాటిని 75 సెకన్లలోపు కనుగొంటే.. మీరు మేధావి అన్నట్లే. 99% మంది వ్యక్తులు వాటిని కనుగొనడంలో పూర్తిగా విఫలమయ్యారు. అయితే ఆ అవకాశం మీకు వచ్చింది.. ఎందుకు ఆలస్యం ప్రయత్నించండి చూద్దాం.

మీరు ఈ పెయింటింగ్‌ను 1 నిమిషం 15 సెకన్ల పాటు చూడాలి. ఈ సమయంలో మీరు వెంటనే మీ కళ్ళతో 25 జంతువులను స్కాన్ చేయవచ్చు. మీరు ఈ జంతువులన్నింటినీ కనుగొన్నట్లయితే ఈ పజిల్‌ను ఒక్క క్షణంలో పరిష్కరించిన 1% మంది వ్యక్తులలో మీరు కూడా ఉంటారు.

చిత్రంలో 25 జంతువులు ఉన్నాయి

మీరు చూస్తున్న పెయింటింగ్‌లో పురుషుడి ఫేస్ ఉంది. అయితే  ఇంకో విషయం చెబుతాను. దీనిని ఇటలీకి చెందిన 16వ శతాబ్దపు  చిత్రకారుడు గియుసేప్ అరిసింబోల్డో కాన్వాస్‌పై చిత్రించాడు. ఈ పెయింటింగ్‌లో ఏనుగు, గుర్రం, నెమలి, ఎలుగుబంటి, పులి, చిరుతపులి, నక్క, కుందేలు, గద్ద, తాబేలు సహా మొత్తం 25 జంతువులు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం కూడా, ఆప్టికల్ ఇల్యూషన్ యొక్క చిత్రం ఎక్కువగా వైరల్ కావడం గమనించదగ్గ విషయం.

కింది చిత్రంలో..

Optical Illusion Test

Optical Illusion Test

ట్రెండిగ్ వార్తల కోసం..