ICC Rankings: బూమ్‌ బూమ్ బుమ్రా.. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ వన్డే బౌలర్‌గా టీమిండియా రేసుగుర్రం.. టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన సూర్య..

ICC ODI Rankings: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా స్పీడ్‌స్టర్‌ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆరు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అతను ప్లేయర్‌ ఆఫ్‌ ది పురస్కారంతో..

ICC Rankings: బూమ్‌ బూమ్ బుమ్రా.. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ వన్డే బౌలర్‌గా టీమిండియా రేసుగుర్రం.. టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన సూర్య..
Icc Rankings
Follow us

|

Updated on: Jul 13, 2022 | 7:54 PM

ICC ODI Rankings: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా స్పీడ్‌స్టర్‌ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆరు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అతను ప్లేయర్‌ ఆఫ్‌ ది పురస్కారంతో పాటు పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఐసీసీ ర్యాంకుల్లోనూ అదరగొట్టాడీ స్పీడ్‌స్టర్‌. మొత్తం 718 పాయింట్లతో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ వన్డే బౌలర్‌గా నిలిచాడు. ట్రెంట్‌ బౌల్ట్‌(న్యూజిలాండ్‌), షాహిన్‌ ఆఫ్రిది(పాకిస్తాన్‌), జోష్‌ హాజిల్‌వుడ్‌(ఆస్ట్రేలియా), ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌(అఫ్గనిస్తాన్‌) వరుసగా 2,3,4,5 స్థానాల్లో నిలిచారు. టాప్‌-5లోనే కాదు టాప్‌-10లోనూ మరే టీమిండియా బౌలర్లు చోటు దక్కించుకోలేకపోయారు.

రోహిత్‌ ముందుకు..

ఇక ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ సారధి బాబర్ ఆజమ్ 892 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అదే జట్టుకు చెందిన ఇమామ్ ఉల్ హక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ కింగ్‌ కోహ్లీ మూడో స్థానంలో, రోహిత్‌ శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. వీరు తప్ప మరే టీమిండియా బ్యాటర్లు టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు.

టీ 20 ర్యాంకింగ్స్‌లో..

ఇక ఐసీసీ టీ20 క్రికెట్‌ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నయా స్టార్‌ ఆటగాడు సూర్యకుయార్‌ యాదవ్‌ దుమ్ములేపాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన అతను ఏకంగా 44 స్థానాలు ఎగబాకాడు. మొత్తం 732 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. కాగా ఇటీవల ఇంగ్లండ్‌తో టీమిండియా టీ20 సిరీస్‌లో సూర్యకుమార్‌ చెలరేగిన సంగతి తెలిసిందే. మొదటి టీ20లో 39 పరుగులు చేసిన సూర్య.. రెండో మ్యాచ్‌లో 15 పరుగులతో ఫర్వాలేదనిపించిన అతను మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి 212 స్ట్రైక్‌రేటుతో 117 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయినా సూర్య మెరుపు ఇన్నింగ్స్‌ హైలెట్‌గా నిలిచింది. ఇక సూర్య మినహా మరే ఇతర టీమిండియా బ్యాటర్‌కు టాప్‌-10లో చోటు దక్కలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..